ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై షాకింగ్ కామెంట్ చేశారు. ఇటీవల చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిగిన విషయం మనకందరికీ తెలిసినదే. దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే రోజులు వచ్చాయని ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ తో చంద్రబాబు భేటీ అయినప్పుడు మీడియాతో వివరించడం జరిగింది.

Image result for kiran kumar reddy

ఈ క్రమంలో గతంలో బద్ద శత్రువులు గా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి మరియు చంద్రబాబు ప్రస్తుత పరిణామాలు బట్టి స్నేహితులుగా మారినట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఇటీవల అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున పర్యటించిన కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుపై పోగడ్తల వర్షం కురిపించారు.

Image result for kiran kumar reddy

చంద్రబాబు చాలా తెలివైన వ్యక్తి అంటూ కితాబిచ్చారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యమని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం ఏమీ చెయ్యలేదని ఆరోపించారు.

Image result for kiran kumar reddy chandrababu

ఇప్పటి వరకు కేంద్రం చేసింది శూన్యమంటూ విమర్శించారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిశారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేసిన భారతీయ జనతా పార్టీకి జనసేన మరియు వైసిపి పార్టీలు మద్దతు ఇస్తాయో..లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చడంలో పార్టీకి మద్దతు తెలుపుతాయో తేల్చుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: