ముచ్చటైన మూడు ప్రాంతలా తెలుగు రాష్ట్రం రెండుగా మారింది. నిండు కుండ పగిలింది. ఇపుడు మిగిలిన ముక్కలోనూ బీటలు కనిపిస్తున్నాయి. దానిని సరిచేసుకోలేకపోతే మరో ప్రమాదం పొంచి ఉన్నట్లే మరి. ఈ సంగతి ఎంతో అనుభవం కలిగిన ఆంధ్ర రాష్ట్గ్ర  పరిపాలకులు ముందుగానే గుర్తించి తగిన మందు వేయాల్సిన అవసరం ఉంది. 


హామీ నీటి మూటైందా:


శ్రీ భాగ్ ఒప్పందం జరిగి సరిగ్గా ఈ రోజుకు 81 ఏళ్ళు. 1937 నవంబర్ 16న ఇదే రోజు మద్రాస్ లో కాశీనాధుని నాగేశ్వ‌రరావు పంతులు గారి స్వగ్రుహంలో అప్పటి మద్రాస్ స్టేట్ లో ఉన్న ఏపీ కొస్తా నాయకులు, రాయలసీమ నాయకులు కలసి కూర్చుని చేసుకున్న  ఒక ఒడంబడిక. దాని ప్రకారం ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటైతే రాజధాని కానీ, హై కోర్టు కానీ రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సీమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. క్రిష్ణ, తుంగభద్ర, పెన్న నదుల్లో ఎక్కువ నీటి వాటా సీమ ప్రాంతానికి బదలాయింపు జరగాలి, రాయలసీమకు  కూడా కోస్తాతో సమానంగా  శాసన సభ సీట్లను పెంచాలి. మరి ఈ ఒప్పందం అమలు అయిందా...


రగులుతున్న రాయ‌లసీమ:


ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉమ్మడిగా పోరాడిన సీమ, కోస్తా నాయకులు తరువాత కాలంలో మాత్రం శ్రీ భాగ్ ఒప్పందాలను మరచిపోయారు. ఇందుకు కోస్తా నాయకులతో పాటు సీమ నాయకుల తప్పు కూడా ఉంది. ఉమ్మడి ఏపీలో ఎక్కువగా సీమ నుంచే ముఖ్యమంత్రులు అయినా వారు సుదీర్ఘ కాలం పని చేసినా తమ ప్రాంతానికి న్యాయం చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.
ఇపుడు ఏపీ రెందు ముక్కలైంది. సీమ ప్రాంతంలో రాజధాని కానీ హై కోర్టు కానీ కోరుతున్నారు. కానీ ఆ రెండూ కూడా కోస్తాకే వెళ్ళిపోయాయి. దానికి తోడు నీటి ప్రాజెక్టులలోనూ అన్యాయం జరుగుతోందని అంటున్నారు. అందుకే మరో మారు రాయసీమ రగులుతోంది.


ఆ ప్రాంతం  వారే :


చిత్రమేమిటంటే నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి, , ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ సీమ ప్రాంతానికి చెందిన వారే. మరి ఉద్దండులు ఇద్దరూ ఉన్నా సీమకు అన్యాయం జరగడం దారుణమే. సీమ నాలుగు జిల్లాల్లో  52 ఎమ్మెల్యే సీట్లు, ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. మరి ఓట్లూ సీట్లు తీసుకుని సీమకు అన్యాయం చేస్తారా అంటూ నేతలు గొంతు ఎత్తుతున్నారు. 
శ్రీ భాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చెస్తూ ఈ రోజు విజయవాడలో భారీ ఆందోళనను నిర్వహిస్తున్నారు. మరి ఇది ఆరంభం అని అంటున్నారు. న్యాయం జరగకపోతే మరో ముక్కగా ఏపీ విడిపోతుందని కూడా చెబుతున్నారు. దీన్ని మొగ్గలోనే తుంచి రాయలసీమకు న్యాయం చేయాల్సిన అవసరం ఎతైనా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: