ఆయన అసలు పేరు ఏదైన ముద్దు పేరు మాత్రం జాక్ పాట్ సీఎం. ఎందుకంటే అతి తక్కువ ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచానని అనిపించుకున్న ఆయన పక్కన కనీసం ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేకుందా ఉమ్మడి ఏపీకి అనూహ్యంగా సీఎం అయిపోయారు. ఏకంగా మూడున్నరేళ్ళ పాటు ఆయన ఆ పదవిని అనుభవించారు. తీరా కీలక క్షణాల్లో  అటు ఏపీ జనానికి, ఇటు అధినాయకత్వానికి ఝలక్ ఇచ్చేసి తప్పుకున్నారు. ఇన్నాళ్ళకు మళ్ళీ పెద్ద గొంతు చేసుకుని జనాల్లోకి వస్తున్నారు.


బాబు అపర మేధావట:


చంద్రబాబు ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చరిత్ర చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిది. అయితే జగన్ ఫ్యాక్టర్ కారణంగా సీఎం గా ఉన్న టైంలోనే ఇద్దరూ తెర చాటున ఒక్కటి అయ్యారు ఆ తరువాత కాంగ్రెస్ భజన ఆపేసి విభజన అడ్డుకుంటామని చెప్పి చెప్పు పార్టీతో  గత ఎన్నికల ముందు జనంలోకి కిరణ్ వచ్చారు. అయినా గెలిచే  ధైర్యం లేక ఆయన సొంత పార్టీ నుంచి కూడా పోటీ చేయలేదు, తమ్ముడు పోటీ చెస్తే డిపాజిట్ రాలేదు ఇదీ చరిత్ర. 
చాన్నాళ్ళుగా మౌనంగా ఉన్న ఈ రెడ్డి గారు ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇందంతా  బాబు ముందస్తు వ్యూహమేనని అంటారు. చేరిన చాన్నాళ్ళకు జనంలోకి వచ్చిన మాజీ సీఎం బాబు అపర చాణక్యుడు మేధావి అంటూ మెచ్చుకుంటూ జాకీలు వేసే పనిలో పడ్డారు.


ఎంపీ సీటు కోసమేనా:


వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి అంతా రెడీ చేసుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ కి ఎటూ ఉనికి లేదు. టీడీపీ తో పొత్తు ఉంటే గట్టెక్కగలమన్న ధీమాతోనే ఆయన బాబును ఇలా పొగడడం మొదలెడుతున్నారు. కేంద్రంలో రాహులు ప్రధాని అయితే ఆయన మంత్రి వర్గంలో చేరి మరో మారు అధికారం అనుభవించవచ్చునన్న ఆలోచన తప్ప నాలుగున్నేరేళ్ళుగా మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యత గల నాయకునిగా ఏపీకి ఏం చేశారో కిరణ్ కుమార్ రెడ్డి  గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. 
ఏమీ లేకుండానే ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి, విభజన ఆపుతానని నమ్మించి ఏపీ ప్రజలను మోసం చేసిన రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి చేసేది ప్రజా సేవే అందామా. పైగా ప్రజా సమస్యలపై ఏదో రూపంలో జనంలో ఉంటున్న వైసీపీ  అధినేత జగన్, జనసేనాని పవన్ లను విమర్శించడం ఈ టైం పాస్ పొలిటీషియన్ కి తగునా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: