ఒకప్పుడు వెండితెరపై బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, వేణు మాధవ్ ల జోరు కొనసాగిన విషయం తెలిసిందే. కొన్ని చిత్రాలు వీరి కామెడీతో రన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ప్రస్తుతం బాబు మోహన్ రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే..బ్రహ్మానందం జోరుకూడా దగ్గడంతో ఆయన బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు.  కోటకు వయసైపోయింది..ప్రస్తుతం జబర్ధస్త్ నుంచి కొంత మంది కమెడియన్లు ఎంట్రీ ఇవ్వగా..వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి మరికొంత మంది కమెడియన్లు తమ సత్తా చాటుకుంటున్నారు. 

అయితే వేణు మాధవ్ మంచి కమెడియన్ మాత్రమే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్..ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేశారు.  ఆ మద్య వేణు మాధవ్ ఆరోగ్యం బాగాలేదని రక రకాల పుకార్లు వచ్చాయి..కానీ వాటన్నింటిని కొట్టి పడేశారు..ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాని ప్రకటించారు.  వేణు మాదవ్ మొదటి నుంచి టీడిపి వీర అభిమానిగా ఉంటూ వస్తున్నారు.  తాజాగా  వేణుమాధవ్ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు తెలిపాడు.

ఈ మేరకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వేణు మాధవ్ తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే మహాకూటమి పొత్తుల కారణంగా ఆయనకు అవకాశం లభించక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోని దిగినట్లు చర్చించుకుంటున్నారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణమే.

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మిమిక్రి ఆర్టిస్ట్ గా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ సభల్లో మిమిక్రీ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత సినిమాలలో ఛాన్సులు రావడంతో... నటుడిగా బిజీ అయిపోయారు. ఈ సందర్బంగా వేణు మాధవ్ మాట్లాడుతూ..తన కామెడీతో ఒకప్పుడు ప్రజలను నవ్వించానని..ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి వారికి వంతు సేవ చేయడానికే క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: