జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కుట్ర బయటపడుతుందని చంద్రబాబునాయుడు భయపడుతున్నారా ? చూడబోతే అలాగే అనిపిస్తోంది. లేకపోతే సిబిఐ విచారణను అడ్డుకుంటూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటమేంటి ? అదికూడా హత్యాయత్నం కేసులో రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని హైకోర్టు చంద్రబాబుకు నోటీసులిచ్చిన నేపధ్యంలో. పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. తనపై జరిగింది హత్యాయత్నమే అంటూ జగన్ చెబుతున్నారు. కాదు దాడి కేవలం డ్రామానే అంటూ చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జగన్ కుట్ర కోణాన్ని బయటకు తీయాలనే డిమాండ్ థర్డ్ పార్టీ విచారణ కోరుతూ హై కోర్టులో కేసు వేశారు.

 

ఇక్కడ థర్డ్ పార్టీ అంటే సిబిఐ కావచ్చు లేదా జ్యుడీషియరీ విచారణ కూడా కావచ్చు. ఆ విషయంపైనే హై కోర్టు సమాధానం చెప్పాలంటూ చంద్రబాబుకు నోటీసులిచ్చింది. ఇక్కడే చాంద్రబాబుకు సమస్య మొదలైంది. జగన్ పై దాడి విషయంలో మీడియా సమావేశంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాదు కోర్టుకు సమాధానం చెప్పటమంటే. ఇప్పటికే కోర్టులో అడ్వకేట్ జనరల్ వాదనలు బలహీనంగా ఉన్న విషయం అర్ధమైపోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో కోర్టు గనుక హత్యాయత్నం ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశిస్తే అంతే సంగతులు.

 

ఎందుకంటే, దాడి ఘటనపై ఇఫ్పటి వరకూ కనబడుతున్న ఆధారాలన్నీ హత్యాయత్నమే అన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. అందుకే ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ కూడా ఏమీ తేల్చకుండా నాన్చుతోంది. ఇటువంటి పరిస్దితుల్లో సిబిఐ రంగంలోకి దిగితే మొత్తం తీగంతా కదలటమే కాకుండా డొంక కూడా బయటపడుతుంది. అప్పుడు హత్యాయత్నం కుట్రలో ఎవరెవరి పాత్రేంటో స్పష్టంగా బయటకు వచ్చేస్తుంది. అది కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా ? హత్యాయత్నం కుట్రలో చంద్రబాబే సూత్రదారంటూ వైసిపి ఆరోపిస్తోంది. అదే గనుక సిబిఐ విచారణలో తేలితే ? లేదా ఇంకెవరైనా టిడిపి నేతల పాత్రుందని తెలినా చంద్రబాబుకు కష్టమే.

 

అందుకే తనకు అధికారాలు లేకపోయినా సిబిఐ విచారణను, దాడులను చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు చేస్తున్న పని పూర్తిగా కేంద్రానికి నేరుగా యుద్ధానికి కాలు దువ్వటమే. ఒకవేళ చంద్రబాబు చేసిందే సబబని అనుకుందాం. రేపటి పలానా జిల్లా పోలీసులు తమ జిల్లాలోకి అడుగుపెట్టేందుకు లేదని ఓ జిల్లా కలెక్టర్ సర్కులర్ జారీ చేస్తే చెల్లుతుందా ? చంద్రబాబు అంగీకరిస్తారా ? ఇదికూడా అలాంటిదే. ఈరోజు సిబిఐ దాడులన్నారు రేపు ఐటి దాడులు కూడా జరిగేందుకు లేదంటారు.

 

జరుగుతున్నదంతా చూస్తుంటే చంద్రబాబు పిచ్చి పీక్స్ కు చేరుకున్నట్ల కనబడుతోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా ఎవరో తప్పుడు సలహాలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రబాబు ఎన్నో ఘటనలపై సిబిఐ విచారణను డిమాండ్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగ అధికారంలో ఉంటే మరోలాగ వ్యవహరిస్తున్న విషయం అర్ధమైపోతోంది. తాజా ఉత్తర్వులతో కేంద్రం ఎలా స్పందిస్తో చూడాల్సిందే.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: