ఇందిరాగాంధీ ఈ పేరు వింటే..తెగింపు,ధైర్యం,పట్టుదల అన్ని గుర్తుకు వస్తాయి..ఒక మహిళ అయి ఉండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏలారు.  ఎన్ని సంక్షోబాలు ఎదురైనా ధైర్యసాహసాలతో ప్రధాని హోదాలో కొనసాగారు.  1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా జన్మించిన ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. గొప్పింటి ఇంటిలో ఇందిరా జన్మించింది . తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి.  18 సంవత్సరాల వయస్సులోనే ఇందిర వానర సేనను నడిపి ఉద్యమాలలో అనుభవం సంపాదించింది. ఆసమయంలోనే 1936లో తల్లి కమలా నెహ్రూను కోల్పోయింది.

1938 లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రవేశించింది.  ఇందిర ప్రియదర్శిని బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివింది. ఇంగ్లండు లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది.జర్నలిస్ట్ ఫిరోజ్ తో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది.  నెహ్రు బ్రాహ్మణులు కావటం .. ఫిరోజ్ ముస్లిం కావటంతో పెళ్లి చేయటానికి నెహ్రు ఒప్పుకోలేదు ..చివరికి గాంధీ ఫిరోజ్ ని దత్తత తీసుకావటంతో ఫిరోజ్ పేరు ఫిరోజ్ గాంధీగా మారింది తర్వాత నెహ్రు ని ఒప్పించి గాంధిజీ . 1942లో ఇందిరా ,ఫిరోజ్ లా పెళ్లి చేసాడు.
Image result for ఇందిరాగాంధీ గురించి
భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది.  1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది.  1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. 1960 సెప్టెంబర్ 8న ఫిరోజ్ గాంధీ మరణించాడు. 1964 మే 27న జవహర్ లాల్ నెహ్రూ మరణించడంతో ఇందిర జీవితంలో విషాదం ఏర్పడింది. తండ్రి మరణానంతరం ఇందిర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. 

1966 జనవరి 24న ఇందిర మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించింది. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్నిచేపట్టలేదు. ఇందిర 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది.  1977లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది.
Image result for ఇందిరాగాంధీ గురించి
ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో విజయం సాధించి లోక సభలో మళ్ళీ అడుగుపెట్టింది. ఆ తర్వాత 1980 మధ్యంతర ఎన్నికలలో భారీ విజయం సాధించి మరో పర్యాయం ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టింది.  మరో విశేషం ఏంటంటే..ఆమె స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది.



మరింత సమాచారం తెలుసుకోండి: