కేంద్ర నిఘా సంస్థ లలో ఒకటి అయిన సి.బి.ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనిఖీలకు రావాలంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని కొత్తగా జీవో పాస్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. దీంతో చంద్రబాబుకు తీసుకున్న నిర్ణయం పార్టీ జాతీయ రాజకీయాలలో ఇటు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Image result for chandrababu

ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై సంచలన కామెంట్ చేశారు. తాజాగా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకునే సీబీఐ రావాలి అంటూ టీడీపీ సర్కార్ తీసుకువచ్చిన జీఓ టిష్యూ పేపర్‌తో సమానమని.. అది చెల్లదని ఉండవల్లి అన్నారు.

Related image

రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని తెగ అదరగొట్టే చంద్రబాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై సీబీఐ నేరుగా దాడులు చేయవచ్చునని ఉండ‌వ‌ల్లి అన్నారు.

Related image

ఇక ప్రజా సమస్యల కోసం కోర్టు ఆదేశిస్తే సీబీఐ తప్పనిసరిగా రంగంలోకి దిగుతుందని ఉండ‌వ‌ల్లి చెప్పారు. తాను నిప్పులాంటి నాయ‌కుడని చెప్పుకునే చంద్ర‌బాబు సీబీఐకి భ‌య‌ప‌డ‌డం ఏంట‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. ఇక ఇలాంటి పిచ్చి జీవోల‌తో చంద్రబాబు రాష్ట్ర పరువు తీస్తున్నారని...వెంటనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర పరువుని నిలపాలని కోరారు ఉండవల్లి.



మరింత సమాచారం తెలుసుకోండి: