కేంద్ర నిఘా దర్యాప్తు సంస్థ సిబిఐ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమర్థించారు.

Related image

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏటువంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా రాష్ట్రంలో దర్యాప్తు చేయకూడదని తీసుకున్న నిర్ణయం ప్రస్తుత రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన నేపద్యంలో తాజాగా మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Image result for chandrababu mamatha

కాగా ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తన అధికారులను వినియోగించుకునేందుకు సీబీఐకి సమ్మతి అవసరం. అయితే గత కొంతకాలంగా సీబీఐ ప్రతిష్ట మసకబారుతూ వస్తుండటంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర రంగ ఉద్యోగులపై దాడి చేసే అవకాశం సీబీఐకి ఉండదు.

Image result for chandrababu mamatha

చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టేనని సీనియర్ రాజకీయ నేతలు చెబుతున్నారు. మరోపక్క వైసీపీ నేతలు చంద్రబాబు చేస్తున్న అవినీతి పట్ల కేంద్ర ప్రభుత్వం త్వరలో దాడి చేస్తుందేమోనని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన స్వార్ధ రాజకీయాలకోసం వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని తీసేస్తున్నారని మండిపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: