మహమ్మద్ బిన్ తుగ్లక్ తరహా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం బాటనే అనుసరిస్తున్నారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తమ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు, విచారణలు చేపట్టడానికి వీల్లేదంటూ ఏపి సిఎం చంద్రబాబు స్పష్టీకరించిన తరహాలోనే మమత కూడా స్పందించారు. పశ్చిమ బెంగాల్‌ లో ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా సోదాలు, దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి అవకాశం కల్పించిన 1989నాటి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు పశ్చిమ బంగ సచివాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 
Image result for chandrababu mamata both are criminals
"పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం" కింద పనిచేసే సీబీఐ అధికారపరిధి డిల్లీ వరకే ఉంది. ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించాలంటే  ఆయా రాష్ట్రప్రభుత్వాల సాధారణ సమ్మతి   అవసరం. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి అనుమతి ఆదేశాలను 1989లో నాటి వామపక్ష ప్రభుత్వం జారీ చేసింది. తాజాగా నిన్న శుక్రవారం సాయంత్రం మమతా బెనర్జీ వాటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇకపై న్యాయస్థానం ఆదేశించిన కేసుల్లో తప్ప, సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టాలన్నా రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసు కోవాల్సి ఉంటుంది.
Image result for chandrababu mamata both are criminals
దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలపటమే కాకుండా ఆయన బాటలోనే నడిచి కేంద్రంపై సమరానికి సమాయత్తమైనట్లే. ఏపీలో సీబీఐ అధికారుల దాడులను నిరాకరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసి సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే "సాధారణ సమ్మతి ఉపసంహరణ" ఉత్తర్వును ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 


కాగా, చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై మమతా బెనర్జీ నిన్న స్పందించారు.  చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం సరైందేనని ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఆమె మద్దతు పలికారు. 
Image result for chandrababu mamata both are criminals

Everybody Lift The Hand Except Chandra Babu - Why? | 


రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే "సమ్మతి" ఉత్తర్వును ‌ నిన్న ఉపసంహరించుకుంది. అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రతిష్ఠ మసకబారిందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా దాన్నే అనుసరించారు పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమత బెనెర్జి కున్నారు.


ఈ సందర్భంగా ఏపీలోకి సీబీఐని అనుమతించబోమని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేశారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆయనకు అభినందనలతో పాటు మద్దతు పలికారు. భాజపా తన రాజకీయ ప్రయోజనాలు, ప్రతీకారాల్ని నెరవేర్చుకునేందుకు సీబీఐ, ఇతర సంస్థలను ఉపయోగిం చుకుంటోందని ఆరోపించారు. 
Image result for chandrababu mamata both are criminals
శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సీబీఐ, ఆర్‌బీఐ వంటి కీలకసంస్థలను నాశనం చేస్తోందనీ, వాటి పనితీరును మార్చేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. సీబీఐకి రాష్ట్ర ప్రవేశ అనుమతుల ఉపసంహరణపై స్పందిస్తూ



"అలాంటి నిబంధనల్ని ఉపయోగించు కోవడం తమకు అవసరం లేకపోయినా, భాజపా సీబీఐ తదితర సంస్థల్ని తమ రాజకీయ ప్రయోజనాల్ని, ప్రతీకారం తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటుండటం వల్ల ఆ పని చేయాల్సిన అవసరం వచ్చిందని" అన్నారు.

Image result for ferocious mamata


విగ్రహాల్ని ఏర్పాటు చేసే భాజపా లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒక విగ్రహంలా అవుతుందని సెటైలు విసిరారు. సమస్త రంగాల్లో విఫలమైన భాజపాను అధికారం నుంచి తప్పించాలని అన్నారు. భాజపా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పేర్లను మార్చి వెదసే ప్రక్రియలో మునిగి ఉందని అన్నారు. భాజపాకు దేశ పరిస్థితులను మార్చే (గేమ్‌-ఛేంజర్‌) పరిస్థితి లేదని, పేర్లను మాత్రమే మార్చగలదని అవహేళన చేశారు. భాజపాకు ఇప్పుడు మందిర్‌, ఎన్‌ఆర్‌సీ, విగ్రహం, మతరాజకీయాలు అనే నాలుగే అజెండాలు ఉన్నాయని అన్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా రథయాత్రను రావణయాత్రగా మమత అభివర్ణించారు. రథయాత్ర సాగిన ప్రాంతాల్లో పరిశుద్ధ, ఐక్యతా యాత్రలు నిర్వహించాలని తృణమూల్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 



"మొత్తం మీద నరేంద్ర మోడీకి వ్యతిరేఖులంతా నేఱగాళ్ళో లేక నేఱగాళ్లకు వత్తసు పలికేవాళ్ళ జాబితాలో చేరిపోయారని తేలిపోతోంది. "ఏ నేఱం చేయకుంటే లేదా నేఱగాళ్ళకు వత్తాసు పలిక కుంటే 'సిబీఐ కి నో ఎంట్రి" పలకటం ఎందుకు? మీ నిజాయతీని సిబీఐ సమక్షంలోనే నిరూపించుకొని అందరూ కేంద్ర ప్రభుత్వంపై సామూహిక దాడి చేసి ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేయవచ్చుగా!" అంటున్నారు వీళ్ళ పగటి వేషాలు చూసిన విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: