అపర మేధావి, చాణక్య తెలివితేటలకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే వారికి సైతం అస్థిత్వ సమస్య ఏర్పడుతుందా. అన్నీ ఆలొచించి డెసిషన్లు తీసుకునే వారు సైతం తడబాట్లు, పొరపాట్లు చేస్తారా. ఏపీలో ఇపుడు చంద్రబబు వ్యవహారం అచ్చం అలాగే కనిపిస్తోంది.


అవినీతి బురద :


నిజానికి ఏపీ ప్రభుత్వంపై ఇంతవరకు అవినీతి ఆరోపణలే తప్ప ఏ ఒక్కటీ నిజం కాలేదు, రుజువు  కాలేదు. అటువంటిది. చంద్రబాబు తనకు తానే భుజాలు తడుముకుంటూ గుట్టు బయట పెట్టుకుంటున్నరని అంతా అంటున్నారు. ఇది నిజంగా బాబులని బేలతనాన్ని కూడా సూచిస్తోందని చెబుతున్నారు. తనపైన ఎవరో ఏదో చేస్తారని బాబు వణికిపోవడం ద్వారా తాను పెద్ద తప్పు చేశానన్న ఫీలింగ్ జనాల్లోకి పంపించేస్తున్నారు.


సీబీఐ కి నో ఎంట్రీ :


నిజానికి సీబీఐ కి నో ఎంట్రీ అన్నది బాబు  ఈ మధ్య కాలంలో తీసుకున్న అతి పెద్ద దారుణమైన నిర్ణయమని అందరూ అంటున్నారు. వాస్తవానికి ఈ నిర్ణయం వల్ల సీబీఐ ఎక్కడా అగిపోదు, దాని మార్గాలు దానికి ఉంటాయి. కానీ బాబు మాత్రం బాగా బ్యాడ్ అయ్యారని అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల తన ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తుందని చెప్పకనే చెబుతున్నారని, తాను అవినీతిపరులకు అండగా ఉంటామని కూడా సంకేతాలు పంపారని చర్చ సాగుతోంది.


దాడులపై విమర్శలు :


ఇంతకు ముందు ఏపీలో ఐటీ రైడ్లు జగరిగితే బాబు ఇలాగే కంగారు పడిపోయారు. ఈ విధంగా దాడులు చెస్తే బాబుకు ఏమి నష్టం వచ్చిందో అర్ధం కాదని అంతా అనుకుంటున్నారు. దీనిపై ఇంతవరకూ బాబు సరైన సమాధానం కూడా చెప్పలేకపోయారు. తన ప్రభుత్వాన్ని అస్తిర పరచే కుట్ర అంటున్నారు. కానీ దానికి రుజువులు సాక్ష్యాలు కూడా ఎక్కడా చూపించలేకపోయారు. ఎక్కడో ఐటీ రైడ్లు జరిగితే బాబు సర్కార్ ఎందుకు కూలిపోతుందన్నది లాజిక్ కి అందని వ్యవహారంగా మారి టీడీపీ నవ్వులపాలైంది. 
ఇపుడు సీబీఐ కి నో ఎంట్రీ చెప్పడం ద్వారా బాబు మరింతగా ముందుకు పోయారు. ఈ విధానం సమాఖ్య స్పూర్తిని దెబ్బ తీసేదిగా ఉందని కూడా అంతా అంటున్నారు. మొత్తానికి నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన బాబు తాను ఏం చేస్తున్నానో మరచిపోతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: