జగన్ తన మీద జరిగిన హత్యాయత్నం పైన మొదటి సారిగా భహిరంగ సభలో మాట్లాడినాడు. తన మీద జరిగిన దాడిలో ఎన్ని కుట్రలు ఉన్నాయో లాజికల్ గా మాట్లాడుతూ చంద్ర బాబు ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా చంద్రబాబును జగన్ సూటిగా అడిగిన కొన్ని ప్రశ్నలు ప్రజలందర్నీ ఆలోచింపజేస్తున్నాయి.  ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ చేసిన తప్పేంటి చంద్రబాబు? ప్రజల తరఫున నిలబడి, ప్రజల తరఫున పోరాటం చేసి, ప్రజల కోసం ప్రశ్నించినందుకా నన్ను మట్టుపెట్టడానికి ప్రయత్నించింది? ఎయిర్ పోర్ట్ లో చనిపోతే విమానాశ్రయం భద్రత చంద్రబాబు పరిథిలో లేని అంశం కాబట్టి తనమీద రాదు అని చంద్రబాబు భావించారు. ఒకవేళ హత్యాయత్నం విఫలమైతే అది ఆపరేషన్ గరుడ అని చెప్పి తప్పించుకోవచ్చని కుట్రపన్నింది నిజం కాదా చంద్రబాబు?"

Image result for jagan padayatra

ఇలా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు జగన్. చంద్రబాబు ప్రమేయం లేకుండా ఎయిర్ పోర్టులోకి, మరీ ముఖ్యంగా వీఐపీ లాంజ్ లోకి కత్తి ఎలా వస్తుందని ప్రశ్నించారు జగన్. ఇది కుట్రగా కనిపించడం లేదా అని బాబును నిలదీశారు.ఎయిర్ పోర్టులోకి కత్తులొచ్చాయి. ఏకంగా లాంజ్ లోకి కత్తులొచ్చాయి. ఎయిర్ పోర్ట్ లో రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ చౌదరి చంద్రబాబు సన్నిహిత వర్గాల్లో ఒకడు. ఈ రెస్టారెంట్ చంద్రబాబు మనిషిది కాబట్టి, అందులో పనిచేస్తున్న వ్యక్తి కత్తులు తీసుకొని వీఐపీ లాంజ్ లోకి రాగలిగాడు. ఇది కుట్రగా నీకు కనిపించడం లేదా చంద్రబాబు?"

సీసీ కెమెరాలు ఆపి మరీ హత్యకు కుట్ర - జగన్

తనపై హత్యాయత్నం జరిగిన వెంటనే చంద్రబాబు ఆడించిన ఫ్లెక్సీల నాటకం, లేఖ నాటకంపై కూడా జగన్ ప్రశ్నలు సంధించారు. వైఎస్ఆర్ ఫొటో లేకుండా ఫ్లెక్సీ, మడతలు పడకుండా జేబులో ఉత్తరం ఎలా వచ్చాయని నిలదీశారు. దాడిచేసింది జగన్ అభిమాని అంటూ ఫ్లెక్సీ తయారుచేశారు. ఫ్లెక్సీలో పైన వైఎస్ఆర్ లేదా విజయమ్మ ఫొటో ఉండాలి. కానీ పైన గరుడపక్షి ఫొటో పెట్టారు. హత్యాయత్నం జరిగిన గంటలో ఫ్లెక్సీ విడుదల చేస్తారు. అమ్మ-నాన్న ఫొటోలు మాత్రం ఉండవు. దాడిచేసినప్పుడు వ్యక్తి జేబులో ఏదీ కనిపించ లేదు. కానీ ఆ తర్వాత 2 గంటలకు ఉత్తరాలు బయటపడతాయి. పైగా ఆ లేఖలో 2-3 చేతిరాతలు ఉంటాయి. అంతేకాదు, ఆ లెటర్ పై మడతలు కూడా ఉండవు. ఇవి కుట్రగా కనిపించడం లేదా చంద్రబాబు? అని సూటిగా ప్రశ్నించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: