Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 1:16 am IST

Menu &Sections

Search

జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!

జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తనపై విశాఖపట్నం విమానాశ్రయంలో అక్టోబర్ 25న జరిగిన దాడి ముమ్మాటికి కుట్రేనని వైసిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు. నాపై హత్యాయత్న రచన, ప్రణాళిక చేయించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే వైకాపా అధినేత జగన్‌మోహనరెడ్డి ఆరోపించారు.
ap-news-murder-attack-on-ys-jagan-chandrababu-in-b
విమానాశ్రయ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు కాబట్టే అక్కడకి  కత్తులు వచ్చాయన్నారు. శనివారం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ap-news-murder-attack-on-ys-jagan-chandrababu-in-b

*“నేను చేసిన తప్పేంటి? ప్రజల తరఫున ప్రశ్నించినందుకేనా? నన్ను మట్టుబెట్టబోయారు? గతేడాది 2017 నవంబరులో ప్రారంభమైన నా పాదయాత్ర మార్చి నాటికి మహోదృతరూపం సంతరించుకుంది. ఆనాడే నన్ను లేకుండా చేయడానికి చంద్రబాబు అంకురార్పణ చేశారు. 

ap-news-murder-attack-on-ys-jagan-chandrababu-in-b
*“నిజంగా హత్యాయత్నంలో ఆయన పాత్ర లేకపోతే బాధితుడనైన నేను, నావాళ్ళు కోరినట్లు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించడానికి ఆయన ఎందుకు ఒప్పు కోవట్లేదు” అని జగన్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏ దురుద్దేశం లేకపోతే ఆ మార్గంలో స్పందించక పోగా నన్ను, నాపై జరిగిన హత్యా యత్నాన్ని, అవహేళన ఎందుకు చేశారు?  

*ముఖ్యమంత్రికి సీబీఐ పేరెత్తితేనే ఒళ్ళు జలధరిస్తుందని, దేహంలో ప్రకంపనలు చేలరేగిపోతాయని ఆయన చేసిన అక్రమాలపై విచారణ జరిగితే తాను పూర్తిగా దొరికి పోతారనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీపై సమరంగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. 
ap-news-murder-attack-on-ys-jagan-chandrababu-in-b
*ఒకప్పుడు కాంగ్రెస్‌తో కలిసి తనపై కేసులు పెట్టించిన సమయంలో ఆయనకు సీబీఐ ముద్ధు. ఇప్పుడేమో తనపై కేసులనే సమయంలో సీబీఐ వద్ధు – అంటూ  ఏకంగా సిబీఐ కి రాష్ట్ర ప్రవేశాన్ని నిరోధిస్తూ జీవోనే విడుదల చేశారన్నారు. 

*‘అధర్మాల చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాటదీక్షకు కొన్ని జాతీయపార్టీలు కూడా - డూ..డూ బసవన్నల్లాగా  తలూపుతూ వస్తున్నారు. ఆ దీక్షలు చూస్తున్న జనాలకు అయ్యగారి గతకాలపు లీలలు మదిలో మెలగటంతో నవ్వుకుంటూ వెతకారంగా వెళ్ళిపోతున్నారట. 
ap-news-murder-attack-on-ys-jagan-chandrababu-in-b
*చంద్రబాబు వైసిపి జెంఢా క్రింద గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్ని “సంతలో పశువు” లాగా కొనుగోలు చేయడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు సైతం ఇచ్చి ప్రజాస్వామ్యం పరువు దిగజార్చారు. అలాంటప్పుడు ఆయన చేస్తున్న ధర్మపోరాటదీక్ష ధర్మ పోరాటంలా కనిపిస్తుందా? అని జాతీయ పార్టీల్ని జగన్‌ ప్రశ్నించారు.

హత్యా ప్రయత్నం జరిగిన గంటలోపే డీజీపీ ముందుకొచ్చి దాడి చేసింది జగన్‌ అభిమానేనని తప్పుడు ప్రకటనలు చేశారని విపక్ష నేత ఆరోపించారు. "నిజంగా నా అభిమాని అయి ఉంటే, నేను ముఖ్యమంత్రి అయ్యాక గొప్పగా పనిచేయాలని అతడు భావించే వ్యక్తైతే నాపై ఎందుకు హత్యాయత్నం చేస్తాడు? సంఘటన జరిగినప్పుడే సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అతడి జేబులో మరేమైనా ఉన్నాయాని వెదికితే ఏమీ కనిపించలేదు. కాని డీజీపీ అతడి జేబులో లేఖ దొరికిందని ప్రకటించారు.
ap-news-murder-attack-on-ys-jagan-chandrababu-in-b
నేను పాదయాత్ర లో భాగంగా విశాఖలో అడుగు పెట్టినప్పటి నుంచే విమానాశ్రయంలో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. కత్తికి విషం పూసి ఉండొచ్చేమోనని హైదరాబాద్‌ వెళ్లి అక్కడ ఆసుపత్రి లో చేరా. కుట్రని తప్పు దోవ పట్టించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించారు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా నా పోరాటం ఆగదు" అని జగన్‌ అన్నారు.

మార్చి 22వ తేదీన చంద్రబాబు ఒక సినీ నటుడికి  శిక్షణనిచ్చి పాత్రికేయుల సమావేశంపెట్టి  "ఆపరేషన్‌ గరుడ"  ని తెరపైకి తీసుకొచ్చారని జగన్‌ ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరగడమే కాకుండా రాష్ట్రం అతలాకుతలమై ప్రభుత్వం కూలిపోతుందని చంద్రబాబు ఇచ్చిన స్ట్రిప్టును ఆయన చదివారన్నారు.

ap-news-murder-attack-on-ys-jagan-chandrababu-in-b

ap-news-murder-attack-on-ys-jagan-chandrababu-in-b
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాశీ రస రంగేళి…నృత్యం అదిరిందిగా!!
బాహుబలి ప్రభాస్‌ కు భూ వివాదంలో ఊరట: తెలంగాణా హైకోర్ట్
చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతీ చోటా అభ్యర్ధులు ఓడిపోబోతున్నారట!
గందరగోళం కాదది గుండెలుపిండిన కుంభకోణం
చంద్రబాబు సమీక్షల పట్ల టిడిపి వారి నుండే తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమౌతుంది!
“ఒక్క చాన్స్ ఇచ్చి చూద్ధాం!” అనే జనం - అదే జగన్ గెలుపు!
చంద్రన్నను ఆఖరుక్షణాల్లో చెల్లెమ్మలకు పెట్టిన 'పసుపు కుంకుమ' కాపాడుతుందా?
పిల్లల భవిష్యత్ తగలడుతుంటే "కింగ్ కేసీఆర్ నీరోలా ఫిడేల్ వాయిస్తున్నారా!”  ప్రజల ఆక్రోశం
వైసీపీ గెలుపు లో జనసేన పాత్ర కీలకం
తెలుగుదేశం ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయటం అత్యవసరమేనా!
అవకాశాల కోసం ఫ్లడ్-గేట్లు ఎత్తేసి అందాల ఆరేస్తున్నారా! పారేస్తున్నారా!
తెలంగాణా ఇంటర్ బోర్డ్ ఫెయిలైంది - విద్యార్దులు కాదు!
నరేంద్ర మోదీతో దేశానికి పెను ప్రమాదం: నారా చంద్రబాబు నాయుడు
వివాదాల ఆజంఖాన్‌ పై, వెండితెర అందాల జయప్రద పోటీ
విష సంస్కృతి విష వలయంలో విశాఖ ! ఇక విలయమే
చంద్రబాబు దెబ్బకు పునేఠా ఏబీ వెంకటేశ్వరరావు వ్యక్తిగత రికార్డుల్లో 'రెడ్-మార్క్స్'
మూడో దశ పోలింగ్ లో "బంగారు కోడి పెట్ట"!
ఎడిటోరియల్: గురివింద తన కింద నలుపెరగదట! తెలుగుదేశం అధినేత అంతే!
మణిరత్నం హిస్టారిక్ డ్రీం-ప్రొజెక్ట్-నయన్ ప్లేసులో స్వీటీ అనుష్క!
చంద్రబాబు అధికారంపోతే బ్రతకలేరా! మరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేఖ పనులేమిటి?
టిడిపి గుండాగిరికి హైకోర్ట్ నోటీసులు: అధికారాంతమందు చూడవలె!
About the author