వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు వర్తమాన అపరిస్థితులకు  భిన్నంగా ఉంటాయి ఓ వైపు రాజకీయాల్లో చాణక్య నీతిని అమలు చేసే చంద్రబాబు వంటి గట్టి ప్రత్యర్ధిని పెట్టుకుని జగన్ 1950 నాటి రాజకీయాలు చేస్తున్నారు. విలువలు, సిద్ధాంతాలు, పట్టింపులు, నిజాయతీ వంటివి ఇప్పటి రాజకీయ డిక్షనరీలో లేనే లేవు.  ఇంకా చెప్పాలంటే ఓట్లేసే జనంలోనూ అవి పెద్దగా కనిపించడంలేదు. మరెలా....


ఆశ్చర్యం ఏముంది :


తనపైన హత్యాయత్నం జరిగిన 23 రోజుల తరువాత జగన్ ఎట్టకేలకు పెదవి విప్ప్పారు. పార్వతీపురం మీటింగులో ఆయన తనపైన జరిగిన కోడి కత్తి దాటికి కర్త ఖర్మ క్రియ అన్నీ చంద్రబాబే అని కుండబద్దలు కొట్టారు. చిత్రమేమిటంటే జగన్ నోటి వెంట వచ్చిన ఈ మాటలకు ఎక్కడ ఆశించిన స్థాయిలో ప్రతిస్పందన లేదు. పైగా ఓ ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చంద్రబాబునే అంటారని భావిస్తున్నారంతా. అందుకే ఇది ఏపీ జనాలకు సర్వ సాధరణమైన ఆరోపణగానే అయింది.


టీడీపీ ఎత్తుతో చిత్తు :


నిజానికి జగన్ పై జరిగిన దాడి తరువాత ఏపీ జనాల చూపు, వేళ్ళు సహజంగానే చంద్రబాబు, టీడీపీ మీదకు వెళ్ళిపోయాయి. ఆ సంగతి ముందుగా గమనించే హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ, మంత్రులు, చివరికి  చంద్రబాబు హత్య తనపైన జగనే చేసుకున్నాడని ప్రచారానికి తెర లేపారు. దాన్ని తిప్పికొట్టడమో వైసీపీ విఫలం కావడం వల్లనే ఇపుడు జగన్ చేసిన ప్రకటనకు వూహించిన స్థాయిలో స్పందన లేకపోవడం జరిగిందనుకోవాలి.


వ్యూహమే అయితే తప్పే :


ఇక ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. తనపైన హత్యాయత్నం జరిగిన తరువాత వెను వెంటనే జగన్ నోరు ఎందుకు విప్పలేదు, చేతిలో బలమైన మీడియా ఉంచుకుని మరీ జగన్ ఇన్నాళ్ళూ మౌనం ఎందుకు పాటించారు.  జరగాల్సిన రాజకీయ నష్టం అంతా జరిగాక ఇపుడు పార్వతీపురం మీటింగులో తాపీగా  నిజమే చెప్పినా కూడా ఆ  ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది. టీడీపీ ఈ ఇష్యూని ఎపుడో తెలివిగా డైవర్ట్ చేసింది. ఇన్నాళ్ళ తరువాత జగన్ స్వయంగా స్పందించినా ఉపయోగం ఏముంది. 
జగన్ చెబుతున్నట్లుగా ఏపీ అల్లరిపాలు కాకూడదని తాను సహనం పాటించానని అంటున్నారు. ఇపుడు అలాంటి విలువలు ఉన్నాయా. రాజకీయమే చేయాలనుకుంటే అపుడే చేయాలి. హుందాగా వదిలేయాలి అనుకుంటే ఇపుడు కూడా  పెద్ద నోరు చేసుకోకుండా ఉండాలి. కానీ జగన్ మౌనం కొన్నాళ్ళు పట్టి ఇపుడు గుట్టు బయటపెట్టినా నో యూజ్, వ్రతం చెడిపోయింది. ఫలితమూ దక్కలేదు. కాకపోతే జగన్ సానుభూతి సెంటిమెంట్ కోరుకుంటున్నారని టీడీపీ ఆరోపణలు చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: