తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎంత కాదనుకున్నా కులాలదే ఆధిపత్యం. రాజ్యాంగం, రాజకీయాలూ అన్నిటికీ మించి కులాల సమీకరణే పైచేయిగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే రాజ్యాంగాలు, రాజకీయ పార్టీలు లేనప్పటి నుంచి కూడా కులాల పేరిట పోరాటాలు జరిగేవి. ఇపుడు పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నా ఇంకా కులాల కుమ్ములాటలదే అగ్ర తాంబూలంగా ఉంది.


కాంగ్రెస్ రెడ్ల పార్టీ :


తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీగా గుర్తింపు ఉంది. మద్రాస్ ఉంచి ఏపీ విడిపోయినపుడు కూడా కమ్మల , రెడ్ల మధ్య ఆధిపత్య పోరులో బెజవాడ, ర్నూలు మధ్యన   రాజధాని నగరం నలిగిపోయింది. అది చివరకు ఉమ్మడి ఏపీ ఏర్పడేదాకా కొనసాగింది  తెలంగాణా కలసిన తరువాత అక్కడ రెడ్డి సామాజికవర్గంతో కలుపుకుని పూర్తి స్థాయిలో  రెడ్లదే పెత్తనంగా మారింది.
మొదట్లో కమ్మ కులస్థులు వామ పక్ష పార్టీల్లో ఉంటూ కాంగ్రెస్ కు ఎదురు నిలిచారు. ఇక మొదటి, రెండు ఎన్నికల్లో బలం చూపించిన వామపక్షాలు రానూ రానూ దిగనారిపోవడంతో దాంతో పాటే కమ్మ కులస్థుల రాజకీయ  ఆధిపత్యానికి కూడా గండి పడిపోతూ వచ్చింది. 


టీడీపీతో సత్తా :


ఇక 1983న ప్రముఖ సినీ నటుడు, కమ్మ కులానికి చెందిన నందమూరి తారకరామారావు టీడీపీని ఏర్పాటు చేశాక కమ్మ కులస్థులకు రాజకీయంగా గట్టి ఆలంబన దొరికింది. నిజానికి కమ్మ కులస్థుల ఆకాంక్షలకు  ప్రతిరూపంగా దశాబ్దాల కల అలా నెరవేరిందని అంటారు. అప్పటికి 35 ఏళ్ళుగా అప్రతిహతంగా రాజకీయ అధికారాన్ని అనుభవిస్తూ వచ్చిన కాంగ్రెస్ కు, అందులోని రెడ్లకు కూడా టీడీపీ రావడంతో సామాజికంగా బలమైన ఎదురుదెబ్బ తగిలింది. 


పేరుకే పార్టీలు :


ఇక పేరుకు టీడీపీ, కాంగ్రెస్ అని ఉన్నా తెర వెనక మాత్రం కమ్మ, రెడ్ల మధ్య సామాజిక వర్గ పోరు అలా కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడల్లా రెడ్లు ముఖ్యమంత్రులు కావడం, టీడీపీలో కమ్మ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికంగా ఉండడం, పార్టీలో గుత్తాధిపత్యం చలాయించడం ఓ విధానంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో కమ్మ,  రెడ్ల సమరం ప్రాంతాల వారీగా కూడా బలాబలాల‌ను సవాల్ చేసే పరిస్థితి ఎదురవుతోంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: