తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది సమీకరణాలు రోజు రోజుకి ఒక్కోలా మారిపోతున్నాయి. మొన్న సి ఓటర్ సర్వేలో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రిజల్ట్ రావడంతో సంబరాలు చేసుకున్న మహాకూటమి నేతలు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మహా కూటమి నుండి చాలామంది నేతలు టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లి పోవడం తో షాక్ లో ఉన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో మహా కూటమి నేతల మధ్య అంతర్గత విభేదాలు రావడం మరియు చాలామంది నేతలు టికెట్ వస్తుందనే ఆశతో ఉండి చివరాకరికి టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో చాలామంది నేతలు వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు.

Related image

ఈ క్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏనుగు మనోహ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరేందుకు ముఖ్య అనుచరులతో కలిసి వేములవాడ నుంచి మనోహరెడ్డి బయల్దేరారు.

Image result for vemulawada manohar reddy

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి నిష్పక్షపాతంగా పనిచేశానని చెప్పారు. రెండు సార్లు వేములవాడ నియోజకవర్గం నుంచి కాంగ్రేస్ టికెట్ ఆశించాను అయిన తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. ఈసారి కూడా టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేసారని మండిపడ్డారు.  

Image result for congress

ఢిల్లీలో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్లిన లిస్టులో తన పేరు లేకపోవడంతో చాలా మనస్తాపానికి గురయ్యాను అన్ని కాంగ్రెస్ పార్టీలో తనకు విలువ లేకపోవడంతో...టిఆర్ఎస్ పార్టీలో చేరానని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి...ఎన్నికల ముందు కాంగ్రెస్ కి ఊహించని విధంగా సొంత పార్టీ సీనియర్ నేతలు హ్యాండ్ ఇవ్వడం దురదృష్టకరమని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: