ఏపీలో ప్రధాన కులం ఓట్లపై రాజకీయ పార్టీల వ్యూహలేంటి, ఆ కులం బలంతో గద్దెనెక్కిన చరిత్ర తెలిసినా కూడా ఇపుడు ఎందుకు ఉదాశీనంగా ఉంటున్నారు. కొరకరాని కొయ్య లాంటి డిమాండ్ తో ఆ కులం చేటు తెచ్చుకుందా. ఆ డిమాండ్ ను ఎగదోసిన వారి సైతం నిర్వేదం లో పడ్డారా. గెలుపు గుర్రమెక్కించే అతి కీలకమైన ఆ కులం విషయంలో రాజకీయ పార్టీలు ఎందుకు  పిల్లి మొగ్గలు వేస్తున్నాయి.


మారుతున్న వైఖరి :


ఏపీలో కాపు కులం చాలా బలమైనది. ఆ ఓటు బ్యాంక్ ని పట్టుకుంటే చాలు ఎన్నికల గోదారిని ఇట్టే ఈదేయవచ్చు. అలా అధికారం పట్టేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతటి దాకా ఎందుకు 2014 ఎన్నికల్లో టీడీపీ కాపుల మద్దతుతోనే అనూహ్యంగా అధికారం హస్తగతం చేసుకుంది. అంతటి విలువైన ఆ ఓటు బ్యాంక్ విషయంలో రాజకీయ పార్టీలు ఎందుకు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి. కాపుల ఓట్లు అక్కరలేదా. లేక వేరే ఆప్షనులు వెతుక్కుంటున్నారా


బీసీల మంత్రం :


కాపుల ఓట్ల కంటే ఏపీలో మరో అతి పెద్ద ఓటు బ్యాంక్ ఉంది. ఏకంగా యాభై శాతం పైగ గట్టి ఓటు బ్యాంక్ కలిగిన బీసీలు ఇపుడు ఏపీలోని అన్ని పార్టీలకు దిక్కుగా కనిపిస్తున్నారు. కాపుల విషయంలో ఇన్నాళ్ళూ మద్దతుగా ఉన్న పార్టీలు సైతం పునరాలోచనలో పడి బీసీల నినాదం భుజాలకు ఎత్తుకుంటున్నాయి. కాపుల ఓట్లు కోరితే రిజర్వేషన్లు విషయంలో కట్టుబడి తీరాలి. అది అంత సులువుగా అయ్యే పని కాదు. పైగా ఆ రిజర్వేషం మాటెత్తితే మరో వైపు బీసీలు గుస్సా అవుతారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్ల పరిధిలో ఉన్న బీసీలు దెబ్బేస్తే అది మామూలుగా ఉండదు. ఈ కారణంతో అన్ని పార్టీలు బీసీ నామ జపం చేస్తున్నాయి.


ముందే మేలుకొన్న వైసీపీ :


కాపులతో వ్యవహారం తేలేది కాదని ముందే డిసైడ్ అయిపోయిన వైసీపీ బీసీలను చేరదీయడం స్టార్ట్ చేసింది. ఆ పార్టీ అధినేత జగన్ గోదావరి జిల్లాల టూర్లోనో కాపుల రిజవేషన్ విషయంలో చేతులెత్తేశారు. కాపులను ఆర్ధికంగా అదుకుంటానని మత్రమే హామీ ఇచ్చారు. మరో వైపు బీసీలకు పెద్ద పీట వేస్తామని చెప్పడం ద్వారా జగన్ వారికి చేరువ అయ్యారు. పాదయాత్ర పూర్తి  కాగానే వైసీపీ తరఫున కాపు బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


టీడీపీదీ అదే రూట్ :


ఇక మరో పార్టీ టీడీపీది అదే రూట్ గా ఉంది. కాపుల విషయంలో ఓ సారి హామీ ఇచ్చి నెరవేర్చలేని టీడీపీ తనకు మొదటి నుంచి దన్నుగా ఉన్న బీసీలు జారిపోవడంతో కంగారు పడుతోంది. దాంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు జయహో  బీసీ అంటూ సభలు, సమావేశాలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలనే నమ్ముకుని బరిలోకి  దిగాలని చూస్తున్నారు. ఇక మరో పార్టీ జనసేన సైతం కాపులపై ఇంతవరకూ ఎటూ తేల్చలేదు, కానీ బీసీలని చేరదీసే పనిలో బిజీగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: