తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా మహాకూటమి తరపున కుకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న చుండ్రు (నందమూరి) సుహాసినికి ప్రచారంలో ఇబ్బందులు తప్పవా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. హరికృష్ణ మరణం తర్వాత అంత్యక్రియల విషయంలో  కెసియార్ చూపించిన శ్రద్ధ, చేసిన ఏర్పాట్లు తదితరాలు అందరికీ తెలిసిందే. ఇఫుడు అదే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా సుహాసిని పోటీ చేస్తున్నారు. మరి ప్రచారంలో సుహాసిని ఏం మాట్లాడుతారు ? ఎవరిని విమర్శిస్తారు ?  ఇపుడిదే చర్చనీయాంశమైంది.

 

ఇక్కడ ఇబ్బంది అంటే తెలుగుదేశంపార్టీకో లేకపోతే మహాకూటమికో కాదు. నందమూరి కుటుంబానికి మాత్రమే. అంటే ప్రధానంగా సుహాసినికే. నిన్నటి వరకూ సుహాసిని అంటే ఎవరికీ తెలీదు. ఎన్నికల్లో కుకట్ పల్లి నియోజకవర్గంలో ఆమెను పోటీలోకి దించాలని చంద్రబాబు డిసైడ్ చేసిన తర్వాతే సుహాసిని పేరు ప్రచారంలోకి వచ్చింది. సుహాసిని అంటే నందమూరి హరికృష్ణ కూతురు అనే తప్ప మరే గుర్తింపు లేని మాట వాస్తవం.

 

నందమూరి బతికున్నంత కాలం ఆయనకు చంద్రబాబునాయుడుకు మధ్య సఖ్యత లేదు. అవపరానికి వాడుకుని వదిలేసిన చంద్రబాబంటే హరికృష్ణ, కొడుకు జూనియర్ ఎన్టీయార్ కు బాగా మంట.  ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. హరికృష్ణ మరణం తర్వాత ఈయన కుటుంబాన్ని తన గుప్పిట్లో బిగించాలని చంద్రబాబుకు అనుకుంటే సాధ్యం కాలేదు. కల్యాణ్ కు కుకట్ పల్లిలో పోటీ చేసే అవకాశం ఇస్తానని చంద్రబాబు ప్రతిపాదనను తిరస్కరించారు. రాజకీయంగా హరికృష్ణ ఫ్యామిలీని గుప్పిట్లో పెట్టకోవటం సాధ్యం కాదని గ్రహించిన చంద్రబాబు పార్టీ పరంగా సుహాసినిని రంగంలోకి దింపారు.


తండ్రి మరణం సందర్భంగా ఏర్పాట్లు చేయటంపై కెసియార్ చూపించిన శ్రద్ద సుహాసినికి తెలియందేమీ కాదు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే కొడుకు కెటియార్, మేనల్లుడు హరీష్, నల్గొండ మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి పంపారు. అక్కడి నుండి మ్యాగ్జిమమ్ కేర్ తీసుకున్నారు. అంత్యక్రియలయ్యేంత వరకూ కెసియార్ ఇచ్చిన ప్రాధాన్యతపై అప్పట్లో విమర్శలు వినిపించినా లెక్క చేయలేదు. పైగా జూబ్లిహిల్స్ లో హరికృష్ణ స్మృతివనం ఏర్పాటుకు 3 ఎకరాలను కూడా కెసియార్ ప్రకటించారు.

 

ఇవన్నీ తెలిసిన సుహాసిని కెసియర్ ను ఏమని విమర్శిస్తారు ? ఒకవేళ విమర్శలకు దిగితే కెసియార్, టిఆర్ఎస్ నేతలు చూస్తు ఊరుకుంటారా ? నిజానికి కెసియార్ ను లేకపోతే తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం సుహాసినికి లేదు. రాజకీయంగా గొడవలుంటే అది చంద్రబాబు, కాంగ్రెస్-కెసియార్ మధ్యే. పరిస్ధితులను చూస్తుంటే సుహాసిని భుజంపై తుపాకిని ఉంచి కెసియార్ ను కాల్చాలని చంద్రబాబు చూస్తున్నట్లుంది. అది సాధ్యమవుతుందా ? ఎందుకంటే, నందమూరి కుటుంబాన్ని చూసి జనాలు ఓట్లు వేరే రోజులు పోయాయి. కుకట్ పల్లిలో సీమాంధ్రుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లన్నీ టిడిపికే పడతాయని అనుకోవటం భ్రమే. అంటే సుహాసిని గెలుపు చివరి నిముషంలో వరకూ గ్యారెంటీ లేదని తెలుస్తోంది. కెసియార్ పై వైరాన్ని తీర్చుకోవటానికి చంద్రబాబు మరోసారి హరికృష్ణ కుటుంబాన్ని వాడేసుకుంటున్నదే అందరిలోను కనబడుతోంది. మరి, సుహాసిని అదృష్టం ఎలాగుందో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: