విరసం సభ్యుడు వరవరరావును ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ పూణెలోని జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గృహనిర్బంధం ఈ నెల 15న  ముగిసిన నేపథ్యంలో శనివారం పూణె పోలీసులు హైదరాబాద్‌లో వరవరరావును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి రహస్య స్థావరాలతోపాటు మావోల లేఖల్లో ఉన్న కోడ్‌భాష గురించి విచారించేందుకు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు 9 రోజులపాటు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Image result for వరవరరావు

మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో వరవరరావు ఇది వరకే ఓసారి అరెస్టైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు విధించిన గృహనిర్బంధం ఈ నెల 15న  ముగిసిన నేపథ్యంలో శనివారం పూణె పోలీసులు హైదరాబాద్‌లో వరవరరావును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉజ్వల పవార్‌ ఆసక్తికర వాదనలు వినిపించారు. మావోయిస్టు ప్రముఖ నేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావుకు వరవరరావు ఈ-మెయిల్‌ సందేశం పంపినట్లు విచారణలో తేలిందని నివేదించారు.


అందులో అయిదుగురు హక్కుల నేతల అరెస్టుల గురించి ప్రస్తావించారని, లేఖలు ఎలా లీకయ్యాయని గణపతిని వరవరరావు సందేశంలో అడిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారని విన్నవించారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు 9 రోజులపాటు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో వరవరరావు ఇది వరకే ఓసారి అరెస్టైన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ట్రాన్సిట్‌ వారెంట్‌పై పుణెకు తీసుకెళ్లారు. కోరెగావ్‌-భీమా హింస కేసులో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించిన మహారాష్ట్ర పోలీసులు వరవరరావు, మరికొందరిని ఆగస్టు 28న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: