తెలంగాణాలో ఎవరు వస్తారన్నది ఇప్పటికీ అంచనాకు అందడం లేదు. ముందుగా అభ్యర్ధులను ప్రకటించి  ముందస్తులు తెర తీసిన టీయారెస్ ప్రచారంలో ఉండడం వల్ల కాసింత మొగ్గు ఉనంట్లుగా కనిపిస్తోంది. ఇక నామినేషన్ల ఘట్టం ఈరోజు తో ముగిస్తోంది. మహా కూటమి సైతం రేపటి నుంచి జనంలోకి వస్తుంది. అపుడు అసలైన కధ మొదలవుతుందేమో.


యాగా లెందుకో :


ఓ వైపు తెలంగాణాలో ముమ్మరంగా ఎన్నికల సంగ్రామం జరుగుతోంది.కూటమి కట్టకముందు సంగతేంటో కానీ కట్టాక మాత్రం టీయారెస్ విజయావకాశాలపై అంచనాలు రోజుకొకలా మారుతున్నాయి. ఇందులో ప్లస్స్లు  మైనస్సులు కూడా ఉన్నాయి. కేసీయారే  టీయారెస్ కి బలం అయితే, మరో యాంగిల్లో ఆయన పాలన పట్ల ఎంతో కొంత వ్యతిరేకత మైనస్ గా  కూడా ఉంది. మరి ప్రచారం విషయంలో పోటీ పడాల్సిన ఆపధ్ధర్మ ముఖ్యమంత్రి కేసీయార్ యాగాలకు పరిమితం కావడం కూడా సందేహాలు పెంచుతోంది.


ఆ ముహూర్తమే కదా :


మంచి ముహూర్తం చూసుకుని కేసీయార్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అలాగే మంచి సంఖ్యా శాస్త్రం చూసుకుని మరీ 105 అభ్యర్ధుల లిస్ట్ విడుదల చేశారు. మరి అవి మళ్ళీ టీయారెస్ ని అధికారంలోకి రప్పించలేవా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వాటికే అంత బలముంటే, కేసీయార్ ధీమాగా సర్కార్ ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళిన నమ్మకమే గెలవాలి. మధ్యలో యాగాలు చేయడం ఏంటని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.


తుపాను వుందా :


తెలంగాణాలో కేసీయార్ తుపాను ఉందని ఆపధ్ధర్మ మంత్రి జగదీష్ చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి కి ఎందుకంత భయం అన్న ప్రతి విమర్శలూ వస్తున్నాయి. తుపాను ఉంటే  ఇప్పటికే  ఆ సంకేతాలు బయట పడేవి కదా అన్న మాట కూడా ఉంది. ఎన్నికలు అంటే ఎదుర్కోవడమే. గెలిచి వచ్చి వెంటనే రాజీనామా చేసినా తరువాత ఎన్నికల్లొ ఫలితం రివర్స్ అవుతుంది. అదే ప్రజా తీర్పులోని మజాకా. ఇపుడు ఎంత బీరాలు పోతున్నా టీయారెస్ లో గుబులు ఉందన్నది ఆ పార్టీ అధినాయకత్వం చేసున్న చర్యల వల్ల తెలుస్తోంది. మరొ చూడాలి. ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: