Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 11:39 am IST

Menu &Sections

Search

తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన

తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అధికారపార్టీ నాయకుల గోత్రాలు అధికారులకు తెలుసు. ఇది యధార్ధం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధినేతల చరిత్రలు ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాత్రమే కాదు, ఆ తరవాత రిటైరైన మరో మాజీ చీఫ్ సెక్రెటరీ అజేయ కల్లం కూడ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పదవిలో ఉండగా వారు ఈ వివరాలను పరాకునైనా బయటకు చెప్పరు కారణాలు అనేకం. కనీసం బయటకు వచ్చాకైనా నిజాలు బయటపెట్టినందుకు వారిని అభినందిద్ధాం. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని ఈ మధ్యే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ అజేయ కల్లం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో "సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌" సదస్సు నిర్వహించారు. ఆ సందర్భంగా అజేయ కల్లం ఏపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. 

ap-news-retd-cs-ajeya-kallam-ex-cs-iyr-krishna-rao

*ప్రజా సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన నిధులను ప్రచారంకోసం వేలాది కోట్ల ప్రజాధనాన్ని దారిమళ్ళించి ప్రభుత్వం పెద్దఎత్తున దుర్వినియోగం చేస్తోందనిమండిపడ్డారు. 

*ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ₹20000 కోట్లను రాష్ట్రానికి ఇస్తే, అందులో మూడోవంతు నిధులు స్వాహా అయ్యాయని ఆరోపించారు. 

*మార్కెట్‌లో ₹ 4000/-వేల విలువచేసే సెల్‌-ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ₹ 7500/- చొప్పున 5 లక్షల మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా 
₹ 150 కోట్లు గుటకాయ స్వాహా చేశారన్నారు. 

*ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పేరుతో ₹450 కోట్లు విలువ చేసే భూమిని ₹45 లక్షలకే ధారాదత్తం చేశారని ఆయన వెల్లడించారు. 

*రాష్ట్రంలో 80% వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కూడా లభించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

*రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలభించక అప్పులపాలవు తుంటే, మరోవైపు, ప్రభుత్వం విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వ్యాపారులకు దోచిపెడు తోందని ఆరోపించారు. 

*30% తక్కువ వర్షపాతంతో రాయలసీమ, ప్రకాశం జిల్లాల రైతులు ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోవటంలేదన్నారు. 

*రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు ₹11000 చెల్లించినా చిన్నపాటి వర్షానికే కారుతోందని అజేయ కల్లం ఎద్దేవా చేశారు. 

*నాలుగేళ్లుగా ఒక మీడియా సంస్థకు ₹700 కోట్లు ప్రభుత్వం చెల్లించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజా సంక్షేమంకోసం ఖర్చుచేయాల్సిన నిధులను ప్రచారం కోసం 
ap-news-retd-cs-ajeya-kallam-ex-cs-iyr-krishna-rao
*ధర్మ పోరాట దీక్ష, 

*నవనిర్మాణ దీక్ష, 

*పుష్కరాలు, 

*క్యాంప్‌ కార్యాలయాలు, 

*ప్రత్యేక విమానాలు, 

*విదేశీయాత్రలు పేరుతో వేలాది కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 

*అంతేకాక, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ సంపాదనను కర్ణాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

*ప్రజావసరాలకు కాకుండా గతంలో చేసిన అప్పులు తీర్చడానికి ప్రభుత్వం మరిన్ని అప్పులు చేస్తోందని, అలా తెచ్చిన ఋణాలను ప్రయోజనంలేని రంగాలకు ఖర్చు పెడుతోదని అన్నారు. 
ap-news-retd-cs-ajeya-kallam-ex-cs-iyr-krishna-rao
రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, అందరిలో "ప్రశ్నించేతత్వం" పెరగాలని అజేయ కల్లం ఆకాంక్షించారు. 
ap-news-retd-cs-ajeya-kallam-ex-cs-iyr-krishna-rao

సదస్సులో పాల్గొన్న సమాచార హక్కు మాజీ కమిషనర్‌ పి విజయబాబు మాట్లాడుతూ, అవినీతి, అక్రమాలు, దోపిడీలు మితిమీరిన తరుణంలో రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. నేటి ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. హుందా గా వ్యవహరించాల్సిన సభాపతి సైతం పార్టీ ఫిరాయింపు దారులకు మద్దతుగా నిలవటం దౌర్భాగ్యమన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని ఎద్దేవా చేశారు.
ap-news-retd-cs-ajeya-kallam-ex-cs-iyr-krishna-rao 
రాష్ట్రంలో సేవా దృక్పథంతో ఉండాల్సిన విద్య, వైద్య రంగాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వనరుల అభివృద్ధి సూచికలో రాష్ట్రం దేశంలోనే 27వ స్థానం, అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉంటే, అవినీతిలో మాత్రం అగ్రభాగాన ఉందన్నారు. 
నీటి పారుదల ప్రాజెక్టులు రాజకీయ ఆర్ధిక అవినీతి కేంద్రాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా 240000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా, కేవలం 5000  ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణ్‌రావు వివరించారు. అలాగే, 22000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే, కేవలం 6000 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. 
 ap-news-retd-cs-ajeya-kallam-ex-cs-iyr-krishna-rao
కాగా, "సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సదస్సు" లను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్‌ కే రత్నయ్య కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ, ఒక మంత్రి గారి సహకారంతో అనేక కార్పొరేట్‌ సంస్థల ద్వారా విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఆవేదన వ్యక్తంచేశారు. 
ap-news-retd-cs-ajeya-kallam-ex-cs-iyr-krishna-rao
రాయలసీమ మేధావుల సమాఖ్య (ఇంటలెక్చువల్‌ ఫోరం) కన్వీనర్‌ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమకు నికరజలాలను కేటాయించి నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో దళిత ఐక్య వేదిక నేత కల్లూరు చంగయ్య, సామాజిక సేవకురాలు నర్మద, ప్రొఫెసర్‌ రంగారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ap-news-retd-cs-ajeya-kallam-ex-cs-iyr-krishna-rao
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: గురివింద తన కింద నలుపెరగదట! తెలుగుదేశం అధినేత అంతే!
మణిరత్నం హిస్టారిక్ డ్రీం-ప్రొజెక్ట్-నయన్ ప్లేసులో స్వీటీ అనుష్క!
చంద్రబాబు అధికారంపోతే బ్రతకలేరా! మరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేఖ పనులేమిటి?
టిడిపి గుండాగిరికి హైకోర్ట్ నోటీసులు: అధికారాంతమందు చూడవలె!
సిఎం - సిఎస్ మద్య సాండ్-విచ్ అయిపోతున్న అధికారులు! పని సంస్కృతి వారికి తెలియదా?
రధి ప్రియాంక - సారధి చంద్రబాబు - అప్పుడు నరేంద్ర మోదీకి కనిపించేది నక్షత్రాలే!
వారణాసి నుండి ప్రియాంక గాంధి, నరేంద్ర మోడీతో పోటీ పడితే.....!?
అనుక్షణం ఘర్షణ పడే చంద్రబాబులో ఏదో మానసిక సంఘర్షణ  ఉన్నట్లే!
తెలుగు ప్రజల వ్యక్తిగత డేటా ఐటీగ్రిడ్ చేతి గాలిలో దీపం చేశారు: ఈఏఎస్‌ శర్మ
మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న ఎక్స్-సిబీఐ జేడి వి వి లక్ష్మినారాయణ!
బాబు ప్రభుత్వంపై  హరిప్రసాద్ ప్రమేయం అధికమట-ఈవీఎం విషయంలో చేసే యాగీ అంతా ఒక డ్రామానే!
శ్రీవారి పాదాలు నర్తించిన రవీంద్ర భారతి రసరమ్య వేదిక
తాత మనవళ్ళు మూట ముల్లే సర్ధుకుంటారా?  దెవె గౌడ ఫామిలీ పాక్
వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కార్యకర్తల పోలింగ్ బూత్స్ ఆక్రమణ: 10 రాష్ట్రాల్లో పోలింగ్ కూల్:
కుమారస్వామి! నువ్వు 100 సార్లు స్నానం చేసినా గేదె లాగే కనిపిస్తావు: గతి తప్పుతున్న విమర్శలు
ఐటీ గ్రిడ్స్‌ కు పబ్లిక్ డేటా అందజేసింది ఎవరు? వారికి గుండెల్లో గుబులే!
సుమలత తరపున ప్రచారం చేసినందుకు "కేజేఫ్ హీరో యశ్" పై  సిఎం ఫైర్
 ఎపిలో రాష్ట్రపతి పాలన?
ఏపిలొ నేమ్-ప్లేట్ పోలిటిక్స్? అసలు నేమ్-ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారు?
చంద్రబాబు మిత్రపక్షం డిఎంకె కనిమొళి రాజ్యంలో భీభత్సంగా నగదు! ఎన్నిక జరుగుతుందా?
సుమలతను కర్ణాటకలో అమానవీయంగా అవమానించిన జేడీఎస్
ఈవీఎం-వివిపాట్ రాండం శాంపుల్ లెక్కింపు సరిపోదా! రక్తపరీక్ష అంటే మొత్తం పరీక్ష కాదు కదా! ఈసిఐ
About the author