తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల గడువు ముగియడంతో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానానికి తర ముగిసింది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని వీర ప్రసంగాలు చేసిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మందిని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుందని అందరూ భావించిన క్రమంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో..నామినేషన్ల గడువు ముగియడంతో పవన్ వైఖరిపై చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Image may contain: 4 people, people standing, sky, outdoor and nature

ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ ఎక్కడ ఏక్కడ పోటీ చెయ్యాలో అన్న విషయమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు చర్చించి తెలియజేస్తారని ఓ మీడియా ఇంటర్వ్యూలో పవన్ తెలిపారు. అయితే నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో జనసేన పార్టీ ఎక్కడా కూడా నామినేషన్ వెయ్యని క్రమంలో..జనసేన పార్టీ ఇక తెలంగాణాలో లేనట్టేనని అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ నేతలు.

Image may contain: 4 people

ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు...తెలంగాణాలో చేసినట్లు ఏపీలో కూడా ఇలానే చేస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పోతుందని...ఆయనే  నమ్ముకుని జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న ఆంధ్ర ప్రదేశ్ జనసేన పార్టీ కార్యకర్తలు మరియు ఏపీ లో ఉన్న అభిమానులు మిగతా వారి ముందు తలెత్తుకోలేరని కామెంట్లు చేస్తున్నారు.

Image may contain: 14 people, crowd and outdoor

రాజకీయాలలో ఏదైనా చెబితే దానిమీద నిలబడాలని అప్పుడు ప్రజలు విశ్వసిస్తారని...ఈ విధంగానే ఏపీ ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కంటే దారుణంగా జనసేన పార్టీ జండా ఎత్తేసే రోజులు వస్తాయని మరి కొంతమంది రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: