స్వాతంత్రం రాకముందు నుంచే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజకీయాల కంటే, ముందుగా నేర్చుకుంది నయవంచన. అదే దాని నరనరాన జీర్ణించుకు పోగా ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆ నేఱగ్రస్థ కాంగ్రెస్ కు వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ తోడై తెలంగాణాలో మహాకూటమి పేరుతో విపక్షాలను ఏకం చేసిన కాంగ్రెస్ – టిడిపిలు చివరి నిమిషంలో ఆయా పార్టీలకు తమదైన శైలిలో షాకిచాయి. 

Image result for telangana congress men 

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజైన సోమవారం మహాకూటమి లోని భాగస్వామ్య పార్టీలకు కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ చేసింది. ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ లు ఇచ్చి కాంగ్రెస్ దనదైన కుటిల రాజకీయాన్ని రుచి చూపించింది. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ టిడిపిలు టీజేఎస్ నిండా ముంచాయి. 

Image result for telangana congress men 

కోదండరాం టీజేఎస్ కు కేటాయించిన ఆరు సీట్లలో నాలుగింటిలో కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీలోకి దింపింది. హుజురాబాద్ - దుబ్బాక - వరంగల్ ఈస్ట్ - పఠాన్ చెరు లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్స్ ను అందజేసింది.

 Image result for mahakutami

మహాకూటమి పెద్దన్నగా వ్యవహరించిన కాంగ్రెస్ తీరుతో టీజేఎస్ నేతలు షాక్ కు గురయ్యారు. ఇన్నాళ్లు తమను నమ్మించి కాంగ్రెస్ తమను మోసం చేసిందని టీజేఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూరలో కరివేపాకులాగా తమను వాడుకొని వదిలేశారని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న సమయంలో టీజేఎస్ ఎలా స్పందించాలో తెలియని దుస్థితికి చేరుకుంది.

Image result for mahakutami 

తాజాగా టీజేఎస్ పార్టీపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం క్రమంగా గ్రిప్ కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంతర్గతంగానే కాదు బయట కూడా చర్చ జరుగుతోంది. మహాకూటమితో తమకు తగిన రీతిలో సీట్ల సర్దుబాటు చేయించుకోవటంలో కాంగ్రెస్ పై వత్తిడి తేవతంలో కోదండరాం పూర్తిగా విఫలమవడంతో ఆ పార్టీలోని ఇతర ముఖ్యనేతలు ఇప్పుడు పార్టీ అధినేతతో అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధపడ్డారని తెలుస్తున్నది.

Image result for mahakutami 

ప్రత్యేకించి కాంగ్రెస్ వైఖరి పట్ల టీజేఎస్ లోని ముఖ్యనేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పుణ్యకాలం గడిచిపోతున్న సమయం వరకు ఏం చేశారంటూ కోదండరాంపై తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Image result for mahakutami

కాగా చర్చలు - సంప్రదింపుల్లో కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో టిజేఎస్కు స్పందన రాకపోవడంతో కోదండరాం మౌనం వహించారని - అందుకే మీడియాకు కూడా అందుబాటులో ఉండటం లేదని పలువురు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: