అవును నిజమే, ఇపుడు ఏపీకి హైకోర్టు ఎక్కడ ఉంది. అసలు రాజధానే లేదు. అయినా హైకోర్టు వస్తానంటే కూడా మన పాలకులు రానిస్తారా. నిన్న సీబీఐని అడ్డుకున్న వారు నేడు కోర్టులు కూడా వద్దన్న అనగలరేమో. ఈ సందేహం సామాన్యులకూ కలుగుతోంది. అదే విషయాన్ని వైసీపీ అధినేత జగనూ చెబుతున్నారు. బాబుకు ఏది ముద్దో అదే కావాలంటారు. వద్దు అనుకుంటే ఎంతటి దాన్ని అయినా నో అనేస్తారు. అవును మరి బాబు కళ్ళతో చూడాలి. బాబు చెవులతో వినాలి. బాబులాగే ఆలోచన చేయాలి. ఇదే కదా మన పాలకులు ఏపీ ప్రజలను కోరుకునేది.


పంచులు పేల్చిన జగన్ :


విజయనగరం జిల్లా కురుపాం సభలో జగన్ చంద్రబాబుపై ఓ రేంజిలో పంచులు పేల్చారు. బాబు సీబీఐనే వద్దన్న పెద్ద మనిషి, ఇపుడు హైకోర్టు వద్దన్నా అంటారు, అందుకోసం జీవోను కూడా తెచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. తన అవినీతి బయట పడకుండా ఉండేందుకే సీబీఐ ని బాబు వద్దు అంటున్నారని జగన్ అన్నారు. రేపు బాబు అవినీతి మీద విచారణ చేయమని హైకోర్ట్ కనుక ఆదేశిస్తే కోర్టులు సైతం వద్దనగల ఘనుడు చంద్రబాబు అంటూ జగన్ మాటల తూటాలే పేల్చారు.


అక్కడ బిల్డప్ ఎందుకు :


ఏపీలోనే బోలెడు సమస్యలతో జనం చస్తూ ఉంటే పట్టించుకోవాల్సిన బాధ్యత గల ముఖ్యమంత్రి అవన్నీ పక్కన పెట్టేసి ఇపుడు జాతీయ రాజకీయాలు, జాతీయ సమస్యలు అంటూ ఉత్తిత్తి పోరాటం చేయడం విడ్డూరంగా ఉందని జగన్  సెటైర్లు వేశారు. బాబుకు ఫొటోలకు ఫోజులు ఇస్తూ అక్కడేదో చెస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని జగన్ హాట్ కామెంట్స్ చేశారు 
ఏపీలని సమస్యలు పట్టవా అని నిలదీశారు. బాబు ఆడుతున్న డ్రామాలు జనం గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారని జగన్ అన్నారు. విజయనగరం జిల్లా వైఎస్ హయాంలోనే అభివ్రుధ్ధి చెందిందని, బాబు ఉత్త మాటలు చెప్పడం తప్ప చేతల్లో చేసిందేమీ లేదని కూడా జగన్ కడిగేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: