తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి వర్సెస్ కెసిఆర్ , కాస్త బాబు వర్సెస్ కేసీఆర్ లా మారింది. అయితే కాంగ్రెస్ తో చంద్ర బాబు కలవడం తో వారికి ఆక్సిజన్ వచ్చిందనికేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నాయుడు రాహుల్‌ గాంధీకి ఆదేశం లాంటి సూచన చేశాడట. అదేమిటంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడని సమాచారం.

Image result for chandrababu

తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌కు రెడ్ల మీదే నమ్మకం. ఇక్కడి రాజకీయ పరిస్థితికి అదే శరణ్యం అని హైకమాండ్‌ భావించింది. అయితే బాబు మాత్రం రెడ్డికి సీఎం పోస్టు ఇవ్వొద్దని స్పష్టం చేశాడట. మరి అదంతా గెలిచినప్పటి కథ. గెలిస్తే.. కాంగ్రెస్‌ నేతలను పట్టేందుకు ఉండదు. అలాంటి వాళ్లను తనగాటన కట్టేసుకోవడం కూడా చంద్రబాబుకు పెద్ద కథ కాదు. చంద్రబాబుకు ఒక ఏడెనిమిది సీట్లు వచ్చి.. తనమద్దతు లేకపోతే తప్ప కాంగ్రెస్‌ నిలబడే పరిస్థితి లేకపోతే.. అప్పుడు తెలంగాణలో బాబు కింగ్‌ అయినట్టే.

Image result for chandrababu

పాలన మొత్తం.. చంద్రబాబు, ఇద్దరు పత్రికాధినేతల కనుసన్నల్లో నడుస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఏం సందేహం లేదు కూడా. ఇప్పుడు మహాకూటమి వాపును బలంగా చూపిస్తున్నది ఆ మీడియా వర్గాలే. కాబట్టి.. రేపు వీళ్లే గనుక లక్‌ కొద్దీ అధికారాన్ని సంపాదించుకుంటే.. అప్పుడు పాలన మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో సాగుతుంది. అప్పుడు ఏపీలో అధికారం కోల్పోయినా చంద్రబాబు ఫీలవ్వడు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో అధికారం చంద్రబాబుకు ఏపీకి మించిన మజా అవుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: