అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చెబుతుంది. ఓ విధ్యార్ధి తెలివి తేటలు ఒక ప్రశ్నతోనే బయటపడుతుంది. ఒక సినిమా హిట్, ఫ్లాప్ అన్నది మొదటి ఆటతోనే తేలిపోతుంది. మరి ఓ రాజకీయ పార్టీ జాతకం ఎలా తెలుస్తుంది. దానికి ఎన్నికల పరీక్ష ప్రాతిపదికగా. లేక మరేదైనా కొలమానం ఉందా. రాజకీయాలను నిశితంగా గమనించే వారు సర్వేశ్వరుల కంటే కూడా పార్టీల గుట్టు మట్టులు, గోత్రాలు బాగా చెప్పగలరు. ఆ విధంగా చూసుకున్నపుడు ముందే అసలు విషయం వెల్లడవుతుందేమో.


జనసేన ప్రభావం లేదా:


ఈ మాటలు అన్నది ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రభోదకుడు డాక్టర్ కేయే పాల్. అసలు ఆయనకు రాజకీయాలకు ఏంటి సంబంధం అంటే ఉందనే చెప్పాలి. ఆయన తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడే. తాను పార్టీ పెట్టిన వాడే. జనం నాడి కొద్దో గొప్పో తెల్సిన వాడే. అటువంటి పాల్ కీలకమైన కామెంట్స్ చేసేశారు. జనసేనకు ఏపీలో సరైన మైలేజ్ లేదని తేల్చేశారు. ఆ పార్టీ ప్రభావం కూడా పెద్దగా ఉండదని లెక్కలు కూడా వేసారు. మరో వైపు చంద్రబాబు పాలన కూడా గాడి తప్పిందని, హామీలు పక్కన పెట్టారని పాల్ విమర్శలు చేశారు. వాటి సంగతి ఎలా ఉన్నా పవన్ మీద పాల్ చేసిన కామెంట్స్ మాత్రం హీటెక్కిస్తున్నాయి.


పార్టీ రూపు ఉందా:


పాల్ అన్నాడని కాదు కానీ జనసేన ఇప్పటికైతే పార్టీగా పూర్తిగా రూపు దిద్దుకోలేదన్నది వాస్తవం. పవన్ క్రౌడ్ పుల్లర్. దాంతో జనం వస్తారు, మీటింగులు జరుగుతున్నాయి. ఆ తరువాత కధే ఎవరికీ తెలియడం లేదు. అంటే పవన్ ప్రభావం, ఆయన పార్టీ గురించి జనాల్లోకి తెలియాలంటే పార్టీకి సంస్థాగతంగా బలమైన నిర్మాణం ఉండాలి. అపుడే పవన్ మీటింగులు ఎన్ని పెట్టినా రాని స్పందన వస్తుంది. గ్రామాలకు పార్టీ చేరుకుంటుంది. నిజానికి పార్టీ అన్నది క్షేత్ర స్థాయి నుంచే మొదలు కావాలి. కానీ జనసేన తీరు ఉల్టా సీదాగా ఉంది. పై నుంచి దిగువకు వస్తోంది. ఈ ప్రయోగం సులువు. కానీ ఫలితం మాత్రం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.


అందుకే పవన్ పార్టీ గురించిన  ప్రస్తావన వచ్చినపుడల్లా జనాల్లో ఆ ఇంపాక్ట్ కనిపించడంలేదు. పాల్ అన్నాడనే కాదు, పలు సర్వేలు కూడా పవన్ విషయంలో పెద్దగా సత్తా చూపలేడని తేల్చేస్తున్నాయి.
 జన బాహుళ్యంలోకి పార్టీ వెళ్ళలేకపోవడం, నిర్మాణం లేకపోవడమే ఇందుకు కారణం. మరి పవన్ ఇప్పటికైనా ఈ విషయంలో శ్రధ్ధ తీసుకుని ఎక్కడికకక్కడ కమిటీలు వేయడం, అంతా తాను అన్నట్లు కాకుండా క్యాడర్ ని చేరదీయం వంటివి చేయాల్సిన అవసరాన్ని పాల్ కామెంట్స్ గుర్తు చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: