ఉగ్రవాదం, ఉగ్రవాదదేశం పాకిస్థాన్ కు ఇప్పటివరకు బాగా కలసివచ్చింది. ఇరుగు పొరుగు దేశాలపై చిందు లేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు విదేశీ ఆర్ధిక సహాయాన్ని వినియోగించుకుంటూ కాలం పాక్ గుండెల్లో చలిమంటలు రేపే సందర్భం ముంగిట్లోకి చేరింది. సైన్య దురహంకారం, ఐ ఎస్ ఐ గూఢచార సంస్థ కుటిల పన్నాగాలతో పాక్ చెలరేగిపోతోంది. అయితే నేడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పాక్ గుండెల్లో గునపాలు దింపినట్లే. 
Image result for US stopped $1.3 bn aid to Pakistan
యుఎస్ నుంచి పాకిస్థాన్‌కు అందే 1.3 బిలియన్‌ డాలర్ల భద్రతా సంబంధమైన సహకారాన్ని అగ్రరాజ్యం అమెరికా నిలిపివేసింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఒకరు విలేకరులకు ఈ మెయిల్‌ ద్వారా వెల్లడించారు. ఉగ్రవాదం, ఉగ్రవాదౌల కార్యకలాపాల విషయంలో వైఖరి ఎన్నేళ్ళైనా మార్చుకోలేక పోవడంతోనే పాకిస్థాన్‌ భద్రతా సంబంధమైన సహకారాన్ని నిలిపివేసే అత్యంత కఠిన నిర్ణయం అమెరికా తీసుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


అల్‌ఖైదా చీఫ్‌ - ఒసామా బిన్‌ లాడెన్‌ ఆనుపానులు తమకు తెలిసినా పాకిస్థాన్ ప్రభుత్వం అగ్ర రాజ్యం అమెరికాకు చెప్పలేదని ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆరోపించిన కొద్ది రోజులకే ఈ కీలక పరిణామం జరగడం గమనార్హం.
Image result for US stopped $1.3 bn aid to Pakistan
"ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇంతకు ముందు పాకిస్థాన్ నేతలు అమెరికాకు అభయమిచ్చారు. కేవలం నోటి మాటలే కానీ ఆ మార్గంలో పాకిస్థాన్‌ ఎలాంటి కఠినమైన చర్యలు వారిపై తీసుకోలేదు. దీనివల్ల పాకిస్థాన్ ఇరుగు పొరుగు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే అమెరికా ఈ దిశలో ఇంతకాలం తరవాతనే నిర్ణయం తీసుకుంది. అమెరికా భద్రతా సంబంధ సహకారాన్ని నిలిపివేయడం పాకిస్థాన్ కు తీవ్రమైన హెచ్చరికే నని చెప్పకతప్పదు. 


తాలిబన్‌, లష్కర్‌-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలపై ఒకవేళ పాక్‌ కఠినచర్యలు తీసుకొని ఉంటే అఫ్గానిస్థాన్ లోనూ శాంతి బధద్రతలు నెలకొని ఉండేవి. భారత్‌ కు వ్యతిరేకంగా విజృంభించే ఉగ్రవాద సంస్థల జన్మభూమి పాకిస్థానే. వాటిని అక్కడే నిలువరించి ఉంటే భారత్ తో  పాకిస్థాన్ కు సత్సంబంధాలు ఏర్పడడమే కాకుండా మంచి ఆర్థికపరమైన ప్రయోజనాలు పాకిస్థాన్ పొంది వుండేదై" అని గతంలో రక్షణ విభాగంలో పని చేసిన డేవిడ్‌ సెడ్నీ ఒక జాతీయ వార్తాసంస్థతో అన్నారు. ఈయన బారక్ ఒబామా హాయాంలో కిస్థన్, అఫ్గానిస్థాన్‌ రక్షణ విభాగంలో డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేశారు.
Image result for US stopped $1.3 bn aid to Pakistan
హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్‌ ఉగ్రవాదసంస్థల కార్యకలాపాలు నిలువరించనందన 2017 సెప్టెంబరులో పాకిస్థాన్ కు 300 మిలియన్‌ డాలర్ల సైనికపర ఆర్ధిక సహకారాన్ని  డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: