తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు రాజస్థాన్, మిజోరాం,మద్య ప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.  అయితే నిన్నటితో ఛత్తీస్ గఢ్ లో రెండో విడుత ఎన్నికలు కూడా జరిగాయి.  ప్రస్తుతం అభ్యర్థుల భవిత్యం ఈవీఎం లలో నిక్షిప్తమై ఉన్నాయి.  కేంద్రంలో బీజేపీ పాలనపై ఈ మద్య నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ మద్య కర్ణాటకలో ఉపఎన్నికలో బీజేపీ దారుణమైన పరాభవాన్ని పొందింది.  కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 
sachinpilot-nomination
ఆ మద్య రాజస్థాన్ లో కూడా ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది..కాంగ్రెస్ ఆ స్థానాలు దక్కించుకుంది. రాజస్థాన్ లో రాహూల్ గాంధీ మంత్రం బాగానే పని చేసింది.  అయితే వచ్చే ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపిణీ విషయంలో మాత్రం కాస్త అవకతవకలు జరిగినట్లు టిక్కెట్లు ఆశించిన వారు ఆరోపణలు చేస్తున్నారు.

రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఇక పార్టీలకు ప్రచారమే మిగిలింది.   డిసెంబరు ఏడున రాజస్థాన్ లోని 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 22తో ముగుస్తుంది.  ఈ నేపథ్యంలో తిరుగు బాటుదారులను బుజ్జగించే ప్రయత్నంలో బీజేపీ, కాంగ్రెస్ లు ఉన్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: