Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 8:51 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : టిడిపి మ్యానిఫెస్టో : ఉచితంగా ల్యాప్ టాప్ లట..నమ్మేదేనా ?

ఎడిటోరియల్ : టిడిపి మ్యానిఫెస్టో : ఉచితంగా ల్యాప్ టాప్ లట..నమ్మేదేనా ?
ఎడిటోరియల్ : టిడిపి మ్యానిఫెస్టో : ఉచితంగా ల్యాప్ టాప్ లట..నమ్మేదేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణా ఎన్నికల్లో కూడా తెలుగుదేశంపార్టీ ఉచిత హామీలను చాలానే గుప్పించింది. రైతులకు రూ 2 లక్షల వరకూ రుణమాఫీ, ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా ల్యాప్ టాఫ్ ల పంపిణీ ప్రధానమైనవి. పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటమే లక్ష్యంగా ఏపిలో నోటికొచ్చిన హామీలను చంద్రబాబునాయుడు ఇచ్చేశారు. ఇందులో ఆచరణ సాధ్యం కాని హామీలు కూడా చాలానే ఉన్నాయి. అదే పద్దతిలో ఇపుడు తెలంగాణాలో కూడా ఉచిత హామీలిచ్చేశారు.

 

ఈరోజు మ్యానిఫెస్టోను టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ప్రకటించినా చంద్రబాబు అనుమతి లేనిదే రమణ ఒక్కరే మ్యానిఫెస్టో రూపొందిస్తారని ఎవరు అనుకోవటం లేదు. ఏపిలో ఉచిత హామీలిచ్చే జనాలను చంద్రబాబు నిండా ముంచారు. హామీలిచ్చేటపుడు ఆచరణ సాధ్యమయ్యేవేనా లేదా అన్నది చంద్రబాబు చూడరు. తన హామీలను జనాలు నమ్మి ఓట్లేస్తారా వేయరా అన్నది మాత్రమే చూస్తారు. హామీలను నమ్మి ఓట్లేసిన జనాలు తమ ఖర్మ అని తర్వాత సరిపెట్టుకోవాల్సిందే. ఏపిలో ఇపుడు జరుగుతున్నది అదే.

 

పోయిన ఎన్నికల్లో ఏపిలో రైతు రుణాలు రద్దు చేస్తామన్నారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారం విడిపిస్తామన్నారు. కాపులను బిసిల్లో చేరుస్తామని చెప్పారు. డ్వాక్రా రుణాల రద్దు హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ 2 వేల భృతి ఇస్తామన్నారు. మొత్తం మీద 600 హామీల వరకూ ఇచ్చేశారు. హామీలిచ్చి, అధికారంలోకి వచ్చి ఇప్పటికి నాలుగున్నరేళ్ళవుతున్నా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. రేపటి ఎన్నికల్లో ఏ హామీలిస్తే జనాలు నమ్ముతారనే విషయంలో కసరత్తు చేస్తున్నారు.

 

ఇంతలో తెలంగాణా ఎన్నికలు వచ్చేశాయి. అందుకే ఇక్కడ విడిగా ఉచిత హామీలిచ్చేస్తున్నారు. తెలంగాణాలో కౌలు రైతులతో సహా రూ 2 లక్షల వరకూ రైతులకు రుణమాఫీ చేస్తారట. అన్న క్యాంటిన్లలో రూ 5 భోజనం పెడతారట. అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయటానికి ఏపిలో నాలుగేళ్ళు పట్టింది. ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా ల్యాప్ టాప్ లిస్తారట. విభజన బిల్లులో అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి చేస్తారట. ఏపి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేలేక చతికిలపడిన చంద్రబాబు తెలంగాణా అంశాలపైన ఒత్తిడి తెస్తారంటే ఎవరైనా నమ్ముతారా ?


 

ఇక అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, ఇల్లు, సంక్షేమానికి ప్రాధాన్యతట. ఏదన్నా సాధ్యమవుతుందా ? లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులట. ఇది మరీ విచిత్రంగా ఉంది. ఒకవైపు ఏపిలో అవినీతిపరులను కొమ్ముకాసేవిధంగా సిబిఐ ని రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని జీవో జారీ చేసిన చంద్రబాబు తెలంగాణాలో లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులను చేరుస్తారట. బెల్ట్ షాపుల రద్దు కు కూడా హామీ ఇచ్చేశారండోయ్. ఏపిలో బెల్ట్ షాపుల రద్దు ఎంత సవ్యంగా జరిగిందో అందరూ చూస్తున్నదే.


నిరుద్యోగులకు ప్రతీ నెల రూ 3 వేల భృతి ఇస్తారట. ఏపిలో నిరుద్యోగ భృతి ఎంత చక్కగా అమలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తారని కూడా హామీ ఇచ్చేశారు. ఒక విధంగా చూస్తే టిటిడిపి అధ్యక్షుడు రమణ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే అవకాశం లేదనే చెప్పాలి. జనాలు నమ్మి ఓట్లేస్తే అంతే సంగతులు.

 

 

 


telangana-elections-tdp-manifesto-l-ramana-release
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎంఎల్సీలకు షాకిచ్చిన కౌన్సిల్ ఛైర్మన్
వైసిపి  నుండి రివర్స్ ఆకర్ష్
రూ 30 కోట్లకు టిడిపి ఎంఎల్ఏ టిక్కెట్
ఎడిటోరియల్ : ఆ నియోజకవర్గలో గెలవటమే ప్రిస్టేజిగా మారిపోయింది
చంద్రబాబు డబ్బుతోనే శివాజి ఫ్లాట్లు కొన్నాడా ?
ఎడిటోరియల్ : ఏపి ఎన్నికల్లో కెసియార్ ప్లాన్ ఇదేనా ? రిటర్న్ గిఫ్ట్
ఎడిటోరియల్ : ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు కొత్త వ్యూహం
పోలవరంలో అక్రమాలు నిజమే..నిర్ధారించిన కేంద్రం
కెసియార్ ఫార్ములా బాటలోనే జగన్
పులివెందుల్లో జగన్ ప్రత్యర్ధి ఎవరో తెలుసా ?
ఎడిటోరియల్ : జగన్, పవన్ కు వ్యతిరేకంగా పెద్ద వ్యూహం
ఎడిటోరియల్ : చంద్రబాబుకు అంత సీన్ లేదు..ఏపిలో ప్రతిపక్షమే అధికారంలోకి రావాలి
అనర్హతా ? రాజీనామానా ? ఇంత చీప్ ట్రిక్సా ?
ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఓటేయొద్దు..వ్యతిరేక ప్రచారం చేస్తున్న బాధితులు
ఎడిటోరియల్ : చంద్రబాబు చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. తొందరలో కేంద్ర దర్యాప్తు
టిడిపి ఎంఎల్ఏ రాజీనామా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.