మధ్యప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీల నడుమ సవాళ్లు, ప్రతి సవాళ్లు అధికమవుతున్నాయి. మద్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 92 సీట్లు మాత్రమే వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన శాంపిల్ సర్వేలో తేలింది. దాంతో ఇప్పుడు బీజేపీ నేతలకు ఈ విషయం మింగుడు పడటం లేదు. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లోనూ తిరిగి విజయం సాధిస్తామనే ధీమాలో బీజేపీ ఉందని అంటున్నారు.  కాంగ్రెస్ లో గత కొంత కాలంగా నెలకొన్న అంతర్గ కలహాలు..లీడర్ షిప్ ఇక్కడ పెద్దగా లేదని ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పై సునాయాసంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది బిజెపి.

Image result for madhya pradesh bjp congress

ఇదిలా ఉంటే..కాంగ్రెస్ కలహాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని బీజేపీ వ్యతిరేక పవనాలు గట్టిగా వీస్తున్నాయని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ సర్వేలో వెల్లడైందట. పైగా కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 128 సీట్లు వస్తాయనే అంచనాలు వెలువడ్డాయి.  ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక ఉప ఎన్నికల్లో జరిగిన పరాభవం బీజేపీపై గట్టి దెబ్బ పడబోతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీజేపీ ఇప్పటికే మొత్తం 230 సీట్లలో 177 సీట్లలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.  

Image result for madhya pradesh bjp congress

కాగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ లో జ్యోతిరాధిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ వర్గాల్లో నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని సమాచారం. ఈ విబేధాలను తమ విజయానికి అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.  మధ్యప్రదేశ్ కు సంబంధించి కొన్ని ఎన్నికల సర్వేలు బీజేపీ గెలుస్తుందనిచెప్పగా, మరి కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడైంది. మరి ఫైనల్ గా ఏమి జరగనుందో వేచిచూడాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: