భారత దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే.  ఇప్పటికే కర్ణాటకలో ఉత్కంఠభరితంగా కొనసాగాయి.  మొదటి నుంచి కర్ణాటకపై బీజేపీ పట్టు సాధించాలనకున్నప్పటికీ కాంగ్రెస్, జేడీయూ కూటమి సీఎం స్థానాన్ని దక్కించుకుంది.  రీసెంట్ గా కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవానికి గురైంది.  ప్రస్తుతం రాష్ట్రాలల్లో  ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాలకు కేంద్ర బలగాలు భారీగా చేరుకుంటున్నాయి.   

మిజోరాం రాష్ట్రంలోని ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాలకు కేంద్ర బలగాలు మోహరించారు.   40 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని ఎన్నికల ప్రధానాధికారి ప్రతిపాదించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మిజోరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌బీ శశాంక్‌కు వ్యతిరేకంగా పలు సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి నిరసన సెగ తగులుతున్న విషయం తెలిసిందే. 

అయితే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి తమకు 40 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు  కావాలని శశాంక్‌ ప్రతిపాదన చేయగా అది సరైందేనని ఆ రాష్ట్ర పోలీసులు అన్నారు. కాగా  సుమారు 11 లక్షల జనాభా మాత్రమే ఉన్న మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: