Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 3:03 pm IST

Menu &Sections

Search

మిజోరంలో గెలుపు ధీమాతో కాంగ్రెస్ - అభివృద్ధి నినాదంతో బిజెపి - హోరా హోరీ

మిజోరంలో గెలుపు ధీమాతో కాంగ్రెస్ - అభివృద్ధి నినాదంతో బిజెపి - హోరా హోరీ
మిజోరంలో గెలుపు ధీమాతో కాంగ్రెస్ - అభివృద్ధి నినాదంతో బిజెపి - హోరా హోరీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మిజోరంలో అధికారిక భాష అయిన మిజోకు రాజ్యాంగ గుర్తింపు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ మేరకు రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్‌లో ప్రస్తుతమున్న 22 భాషల కు అదనంగా మిజో భాషనూ చేర్చుతామని తెలిపింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు హామీలతో కూడిన మ్యానిఫెస్టోను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌ లో దీనిని విడుదల చేశారు.

national-news-mizoram-state-mnf---bjp-congress

*రూపాయికి కిలోబియ్యం,
*నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం,
*మూడేండ్లలో ట్రాఫిక్ రహిత నగరంగా ఐజ్వాల్,
*ఆరునెలల్లో గుంతల్లేని రహదారుల నిర్మాణం
*రెండు వైద్య, మూడు ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు,
*జిల్లాకో మల్టీస్పెషాలిటీ దవాఖాన,
*ఐజ్వాల్ మీదుగా మయన్మార్-బంగ్లాదేశ్ సరిహద్దుల అనుసంధానం ......వంటి పలు హామీలను బీజేపీ తన ఎన్నికల ప్రణాళిక -మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. 
national-news-mizoram-state-mnf---bjp-congress 
అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధిలో కొంత ఆత్మవిశ్వాసం ప్రభవిస్తుందని అనిపిస్తుంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాము విజయం సాధించబోమన్న విషయం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు బాగా తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మిజోరం శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని మొదటిసారిగా ఇక్కడ జరిగిన సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మిజోరం రాష్ట్ర సంస్కృతిని నాశనం చేయడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తూ ఉన్నాయని విమర్శించారు. 
national-news-mizoram-state-mnf---bjp-congress
"మిజోరంలో తాము అడుగుపెట్టడానికి ఇదే ఆఖరి అవకాశమని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు గ్రహించాయి.. అందుకే వారు ఈ రాష్ట్రంలో సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడు తున్నాయి" అని రాహుల్ గాంధి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రధాన విపక్షంగా ఉన్న "మిజో నేషనల్ ఫ్రంట్ - ఎంఎన్‌ఎఫ్, బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టు కుంటాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్న ఉద్దేశంతో ఎంఎన్‌ఎఫ్ - బీజేపీలు ఎన్నికల అనంతరం భాగస్వాములు అవుతాయని అన్నారు. ఎంఎన్‌ఎఫ్ లాంటి పార్టీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ రాష్ట్ర సంస్కృతిని, భాషను, సంప్రదాయాన్ని, చరిత్రను నాశనం చేస్తోందని రాహుల్ గాంధి విమర్శించారు. ఇలాంటి విభజన ఆలోచనలను కాంగ్రెస్ మొదటి నుంచి తీవ్రంగా ప్రతిఘటిస్తోందని ఆయన అన్నారు.

national-news-mizoram-state-mnf---bjp-congress
రాఫెల్ జెట్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిని ఈ సందర్భంగా రాహుల్ గాంధి ప్రస్తావిస్తూ ఈ వ్యవహారంలో అనిల్ అంబానీ కంపెనీకి మోదీ ₹30 వేల కోట్లు  వ్యక్తిగతంగా అందజేశారని ఆరోపించారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ జనరేట్ యాక్టు - ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ - పథకం కింద దేశానికంతా ఖర్చు చేసే మొత్తానికి ఇది సమానమని ఆయన వివరించారు. 
national-news-mizoram-state-mnf---bjp-congress
ఒక పక్క ఈ డీల్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని రిలయన్స్ కంపెనీ ఖండిస్తుండగా, ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ కంపెనీ తమకు కావాల్సిన ఆఫ్‌సెట్ అవసరాల నిమిత్తం రిలయన్స్‌ తో జాయింట్ వెంచర్ ఉందని పేర్కొంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  మిజోరం రాష్ట్ర ప్రగతిని ఆయన ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మెచ్చుకోతగిన రీతిలో ఉందని అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన లాన్ తన్హావాలా నేతృత్వంలో గత పది సంవత్సరాలుగా రాష్ట్రం లోని ప్రజల ఆదాయం రెట్టింపు అయ్యిందని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది పదకొండు వేల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించి ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరంను ఆదర్శంగా తీర్చిదిద్దు తామని ఆయన హామీనిచ్చారు. 
national-news-mizoram-state-mnf---bjp-congress
ఈసందర్భంగా 1987లో తండ్రి రాజీవ్‌ గాంధీతో చిన్నప్పుడు మిజోరమ్‌ను సందర్శించిన జ్ఞాపకాలను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. తండ్రితో కలిసి మిజోరామ్ వీధుల్లో తిరిగానని, మిజోరామ్‌ లో విజయం సాధించిన తర్వాత తాను మళ్లీ ఇక్కడకు వచ్చి అంతా తిరిగి ప్రజలను కలవాలని అనుకుంటున్నట్టు రాహుల్‌ గాంధీ చెప్పారు.

national-news-mizoram-state-mnf---bjp-congress

national-news-mizoram-state-mnf---bjp-congress
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్ళీ ప్రభాస్ తో అనుష్క ????
హీరోలందరికి పెద్ద తలనొప్పిగా మారిన వరుణ్ తేజ్
నా తీర్పును అపార్థం చేసుకుని  వివాదాస్పదం అంటున్నారు: మేఘాలయ న్యాయమూర్తి
అప్పుడు గెలుపు కోసం రక్షణ రంగాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు జాతీయభద్రతను పణంగా పెడుతుంది
మంచి పాలనలో అరాచక శక్తులు విజృంభిస్తాయి - వీర్రాజు గారి చాణక్య నీతి
అద్ధమంతా చిందిన నీ అందం కిక్కిస్తుంది నిధీ!!
గెలిస్తే తనవల్లే గెలిచిందంటారు ఓడిపోతే ఎందుకు ఓడిపోయారో చెప్పరు: చంద్రబాబు తీరు
కులగజ్జి తీవ్రస్థాయికి చేరటానికి ఏపి అధినేత నిర్వాకమే కారణం: పోసాని కృష్ణ మురళి
జగన్ పై హత్యాయత్నం కేసులో కెంద్రం సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికపై హైకోర్ట్ అసంతృప్తి
రాఫెల్ విషయంలో 36 పిటిషన్లను సుప్రీం ఏకంగా కొట్టివేత - రాహుల్ నోటికి తాళం పడ్డట్టేనా?
టుడే స్పెషల్: రాహుల్ చెంప చెళ్ళుమనిపించి - కాంగ్రెస్ కొంప కూల్చిన - రాఫెల్ డీల్ పై సుప్రీం తీర్పు
చంద్రబాబు సెల్ఫ్ డబ్బా! తారస్థాయికి చేరుతున్న కామెడీ! ఇక అసహ్యమే! జుగుప్సే!
ఇంత తెలివితక్కువ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధి సువిశాల భారతానికి నేతృత్వం వహించగలరా?
ఏపి హైకోర్టు తీర్పు టీటీడీకి చావు దెబ్బైతే - టిడిపికి మరణ మృదంగమా?
₹ 400 కోట్లతో నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం - జనాల్లో తీవ్ర వ్యతిరెఖత టిడిపికి షాక్!
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో పిచ్చి! మాడ్ అయిపోతా! - గ్రేట్ గ్లామరస్ యాక్ట్రెస్
"టీఆరెస్ ఉనికే ఉండదు!" కేసీఆర్ తో సోనియా.....చాలెంజ్!
కేసీఆర్ కు ఆయన కుటుంబమే బలం బలహీనత కూడా!
About the author