కేఏ పాల్ ఇతను పేరు వినిపిస్తే చాలు ఏదో కామెడీ చేస్తున్నాడని మనం అర్ధం చేసుకోవచ్చు. ఇతను మాట్లాడుతుంటే కామెడీ పండాల్సిందే. అయితే ఎప్పటికైనా తన పార్టీ ద్వారా ఎన్నికల్లో నెగ్గి, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవ్వాలనేది కేఏ పాల్ కోరిక. ఈసారి కూడా అదే కోరికను బయటపెట్టారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ తరపున అభ్యర్థులు నిలబడతారని, తను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబడతానని ప్రకటించారు.  2014 తర్వాత మళ్లీ ఈ ఎన్నికల కోసం మీడియా ముందుకొచ్చిన కేఏ పాల్.. ఈసారి జనసేనను టార్గెట్ చేశారు. కాపులు జనసేనను నమ్మడం లేదంటున్నారీయన. ఎంతోమంది కాపులు పాల్ వద్ద కొచ్చి తాము పవన్ ను నమ్మడం లేదని చెబుతున్నారట.

Image result for ka paul

"2008లో బడుగు, బలహీన వర్గాల కోసం ఓ పార్టీ (ప్రజారాజ్యం) వచ్చింది. ఆయన ఓ పెద్ద పార్టీకి అమ్ముడుపోతారని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. ప్రజలకు అర్థమైంది. 2008లో అన్న పార్టీ పెట్టినప్పుడు వెయ్యి మంది జాయిన్ అయ్యారు. పవన్  పార్టీ పెట్టి ఐదేళ్లు అయింది. 5-10 మంది కూడా జాయిన్ అవ్వలేదు. ఇక చాలురా బాబూ మకొద్దు అంటున్నారు కాపులు. జనసేన ను  మేం నమ్మడం లేదని ప్రజలు నా దగ్గరకొచ్చి చెబుతున్నారు."

పవన్ Vs పాల్.. కంప్లీట్ కామెడీ షో

రాబోయే ఎన్నికల్లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు నిలబడతారని, వాళ్లందరి మద్దతుతో తను ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారు కేఏ పాల్. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన రెబల్స్ అందర్నీ కలుపుకుపోతానని, అవసరమైతే పవన్ ను కూడా కలిపేసుకుంటానని పాల్ అంటున్నారు."ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో మేం నిలబడతాం. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది. అన్ని కులాలకు చెందిన బడుగు, బలహీన వర్గాలు నిలబడతారు. నేను ఎక్కడ్నుంచి పోటీచేస్తానో నాకే తెలీదు. పవన్ ను కూడా కలుపుకొని వెళ్లమని చాలామంది సలహాలు ఇస్తున్నారు. చూద్దాం, పవన్ ను కూడా కలుపుకుంటాను." ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఈ 3-4 నెలలు ఇలా పాల్ హడావుడి ఉంటూనే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: