తెలంగాణా ఫైట్  భీకరంగా మారుతోంది. కొదమ సింగాల  మాదిరిగా అగ్ర నాయకులు దూసుకువస్తున్నారు. ఘాటైన స్పీచులతో హీటిక్కిస్తున్నారు. బస్తీమే సవాల్ అంటూ కదన రంగంలో కదం తొక్కుతున్నారు. తెలగాణా సమరంలో అందరినీ ఆకట్టుకుంటున్న మరొక ఇంటెరెస్టింగ్ సీటు కొడంగల్. ఇక్కడ నుంచి చిచ్చర పిడుగులాంటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంత్ రేవంత్ రెడ్డి పోటీకి దిగుతున్నారు.


సవాల్ చెసిన కేటీయార్:


కొడంగల్ ఈ రోజు ఓ ఆసక్తికరమైన  సన్నివేశాన్ని చూసింది. ఇద్దరూ యువ నేతలే. ఇద్దరూ సమ ఉజ్జీలే. ఇద్దరూ సీఎం క్యాండిడేట్లే. టీయారెస్ నుంచి కేటీయార్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఒకే రోజు కొడంగల్ లో తారసపడ్డారు. రోడ్డు షోలతో హోరెత్తించారు. చిత్రమేంటంటే ఇద్దరి మీటింగులకు జనం విరబబడి వచ్చారు. వెల్లువలా తరలి వచ్చారు. అదరగొట్టే ప్రసంగాలతో ఇద్దరూ ఓ రేంజిలో రెచ్చిపోయారు. ఈ సందర్భంగా కేటీయార్ పదునైన  సవాల్ విసిరారు.


రాజకీయ సన్యాసమే :


విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా సాగుతున్న తెలంగాణా సమరంలో మేము మాత్రమే గెలుస్తామని కేటీయార్ ధీమాగా ప్రకటించారు. అంతటితో ఆగలేదు, ఒకవేళ ఓడిపోతే రాజకీయ సన్యాస‌మే అంటూ భీషన ప్రతిన కూడా పూనారు. అదే సమయంలో రేవంత్ కి ప్రతి సవాల్ విసురుతూ కూటమి ఓడిపోతే నీవు రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ నిగ్గదీశారు. కూటమి గెలుపుపై సందేహాలు లేకపోతే తన సవాల్ ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. కొడంగల్ ఓటు టీయారెస్ కే వేయాలని, అపుడే అభివ్రుధ్ధి జరుగుతుందని కూడా కేటీయార్ ప్రకటించారు. క్రిష్ణా జలాలు ఇక్కడికి తీసుకురావడం తమ పార్టీ వల్లనే జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు.


కేసీయార్ తోనే పోటీ :


ఇక రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా తగ్గడంలేదు. తనకు టీయారెస్ లో ఎవరూ పోటీ కానే కాదని తేల్చేశారు. ఒక్క కేసీయారే తనకు పోటీ అని పక్కాగా చెప్పేశారు. ఆరు నూరైనా కొడంగల్ లో జెండా ఎగరేసేది తానేనని కూడా ధీమాగా చెప్పారు. కేసీయార్ వచ్చిన తన గెలుపు ఆపలేరని, కేసీయార్ పోటీ చేసినా కూడా గెలిచి తీరుతానని కూడా చాలెంజ్ చేసి మరీ చెప్పుకొచ్చారు. మొత్తానికి కొడంగల్ ఈ రోజు రెండు కొదమ సింగాలను చూసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: