విచ్చలవిడితనం ప్రజాధనాన్ని దోపిడీ, దుబారా చేయటం కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వచ్చిన వివిధ రకాల ఫండ్స్ ను దారిమళ్లించటం ఇవన్నీ తెలుగుదేశం హాయంలో గత నాలుగున్నరేళ్ల నుండి అడ్డూ అదుపూ లేకుండా జరిగి పోతున్నాయి. అంతేకాదు రాష్ట్ర ఖజానాను కేంద్రంపై తాను తన స్వార్ధం కోసం కొనసాగించే నిరర్ధక పోరాటాలకు ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఇంకా తాను తన ప్రాణాన్ని దేశసేవ కోసం అర్పిస్తానని ప్రజాస్వామ్యపరిరక్షణ తన ద్యేయమని చెపుతూ మరోసారి వివిధ ఉత్తర దక్షిణ భారత యాత్రలు చేస్తూ అక్కడి ప్రాంతీయ పార్టీలను కూడగట్టి కేంద్రానికి వ్యతిరేక్షంగా కూటమి ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలుకుతూ చెసే గారడీ జనాలకు మాత్రం తేళ్లూ జెర్రులూ ప్రాకుతున్నట్లు ఉంటుంది. 
Image result for abnormal increase in chandrababu naidu assets complaint by rama rao in ROC
అలాంటి చంద్రబాబు పాపం పండింది. అందుకే ఆయనపై, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై, ఆయన కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ గ్రూప్ పై ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు.  ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు, ఆయన కుటుంబ సభ్యుల కంపెనీల ఆదాయంపై రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ - ఆర్‌ఓసీ కు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. అమాంతంగా పెరిగిన చంద్రబాబు నాయుడి కుటుంబ ఆస్తులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు. హెరిటేజ్‌ గ్రూప్కు చెందిన వివిధ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా 14 కంపెనీలపై ఆయన ఆర్ధిక నేరారోపణలు చేశారు. 


ఈ వ్యవహారంపై "సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ - ఎస్ ఎఫ్ ఐ ఓ" ద్వారా దర్యాప్తు జరిపించాలని రామారావు తన ఫిర్యాదు లో కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఆర్‌ఓసీ తదుపరి చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. భారత దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ - ఏడీఆర్‌ చేత గుర్తింపబడ్ద నారా చంద్రబాబు నాయుడు ను ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ఆస్తులు ₹177 కోట్లుగా ఏడీఆర్‌ పేర్కొంది. చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు కేవలం ₹34 లక్షలు మాత్రమేనని ఆయన కుమారుడు నారా లోకేశ్‌ గతంలో ప్రకటించారు. తనకు ₹25.25 కోట్లు, బ్రాహ్మణి ఆస్తి ₹25 కోట్లు, తల్లి భువనేశ్వరి పేరుతో ₹25 కోట్ల ఆస్తులున్నట్టు వెల్లడించారు. విచిత్రం ఏమిటంటే చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో మాత్రం ₹11.54 కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించారు తండ్రి లోకేష్. 

Image result for chandrababu heritage group
అయితే నేడు లోకేష్ ప్రకటించిన చంద్రబాబు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తి ₹88.66 కోట్లుగా ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆస్తి మొత్తం ₹2.9 కోట్లు అన్నారు. హైదరాబాద్‌లో నివాసం విలువ ₹8 కోట్లు కాగా, నారావారి పల్లెలో ₹23.83 లక్షల విలువైన నివాసగృహం ఉందన్నారు. తన తల్లి నారా భువనేశ్వరి ఆస్తి ₹31.01 కోట్లు కాగా, తన ఆస్తి ₹21.40 కోట్లు, తన సతీమణి బ్రాహ్మణి ఆస్తి ₹7.72 కోట్లు, తన కుమారుడు దేవాన్ష్‌ ఆస్తి ₹18.71 కోట్లు అని వెల్లడించారు. నిర్వాణ హోల్డింగ్స్‌ నికర ఆస్తులు ₹6.83 కోట్లు అన్నారు. హెరిటేజ్‌ సంస్థ నికరలాభం ₹60.38 కోట్లని ప్రకటించారు. తాము కొన్న సమయంలో ధరల ఆధారంగానే ఆస్తులను ప్రకటించామని లోకేశ్‌ స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే సీఎం కుటుంబ సభ్యుల ఆస్తిలో ₹13 కోట్లకు పైగా పెరుగుదల ఉందన్నారు.
Image result for chandrababu heritage group

మరింత సమాచారం తెలుసుకోండి: