జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై షాకింగ్ కామెంట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కి రిటైర్మెంట్ వయసు దగ్గర పడిందని..చంద్రబాబుతో కలిసి పని చేస్తారా అన్న ప్రశ్నకు ఈ విధంగా ప్రతిస్పందించారు పవన్.

Image may contain: 5 people, people standing, crowd and indoor

మరి అదే విధంగా చంద్రబాబు తో పొత్తు పెట్టుకుంటే అది ప్రమాదకరమని నాకు ఇటీవలే అర్థం అయిందని ముఖ్యంగా జాతీయ నాయకులు చంద్రబాబుతో రాసుకుని పూసుకుని తిరుగుదామని భవిష్యత్తు రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు పవన్. చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకుంటారని అందువల్లే తన కుమారుడిని దొడ్డిదారిన మంత్రిని చేశారని విమర్శించారు.

Image may contain: 1 person, standing, beard and indoor

చంద్రబాబు తనయుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేడని అలాంటిది ఆయనను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని చేశారన్నారు. నామినేటెడ్ పదవిచ్చి పంచాయితీరాజ్ శాఖకు అధిపతిని చేశారంటూ వ్యంగ్యంగా విమర్శించారు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఎలా ఉందో అందరికీ అర్థమవుతుందని పేర్కొన్నారు.

Image may contain: 9 people, people smiling, outdoor

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భవిష్యత్తు మొత్తం జనసేన పార్టీ దేనని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల చెన్నై వెళ్లిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా ఏపీ సీఎం చంద్రబాబుపై మరియు జనసేన పార్టీ భవిష్యత్తు పై అక్కడ ఉన్న విలేకరులకు తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: