వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై వీటివల్ల విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే ప్రతిస్పందించి ఫోన్లో పరామర్శించాలని అనుకున్నారని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. కానీ వైసిపి పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీలో మరియు చంద్రబాబుపై విమర్శలు చేయడంతో వెంటనే ఫోన్ చేసే ఆలోచన నుండి విరమించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని అన్నారు.

Related image

ఇటీవల అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను అనేక ఇబ్బందులు పెట్టారని..వాళ్లకి లొంగని వారిని తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని అనేక మందిని హతమార్చారని అన్నారు.

Image result for lokesh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిరోజు తెలుగుదేశం పార్టీపై మరియు నాయకులపై చంద్రబాబుపై లేనిపోని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో మహాకూటమి కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని..టిఆర్ఎస్ వైసీపీ జనసేన పార్టీలు కలిసిపోయాయని లోకేష్ ఆరోపించారు.

Image result for lokesh

మరియు అదే విధంగా టీఆర్ఎస్ పార్టీకి మరియు బిజెపి పార్టీకి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. అదేవిధంగా గతంలో అవిశ్వాస తీర్మానం కేంద్రంపై పెడితే ఢిల్లీలో పోరాటం చేస్తాను అని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్...అప్పుడు రాలేదు..ఇప్పుడు కేంద్రంపై పోరాడటం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం  బాబు గారు జాతీయ నాయకులతో భేటి అవుతుంటే విమర్శలు చేయటం దారుణమని పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: