Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 3:29 pm IST

Menu &Sections

Search

రెవంత్ కు కెటిఆర్ సవాళ్లు - తెలంగాణా కోడె గిత్తల మధ్య "ఢీ అంటే ఢీ"

రెవంత్ కు కెటిఆర్ సవాళ్లు - తెలంగాణా కోడె గిత్తల మధ్య "ఢీ అంటే ఢీ"
రెవంత్ కు కెటిఆర్ సవాళ్లు - తెలంగాణా కోడె గిత్తల మధ్య "ఢీ అంటే ఢీ"
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణా ఫైర్-బ్రాండ్ రాజకీయ నాయకుడు. పాత మహబూబునగర్ జిల్లా కొత్త వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆతరవాత ఆయన గెలిచిన టిడిపికి రాజీనామాచేసి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ చేరికే బహుశ కాంగ్రెస్-టిడిపి మద్య మైత్రి నెలకొనేలా చేసిందా?   


కొడంగల్ లో అపార ప్రజాభిమానం మూట కట్టుకున్న రేవంత్ రెడ్ది ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రంలో తాను ప్రజా కూటమి తరపున ప్రత్యర్ధి పట్నం నరెందర్ రెడ్డి టి ఆర్ ఎస్ తరపున బరిలో నిలిచారు. అయితే నేడు కొడంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ఆపద్దర్మ మంత్రి కలవకుంట్ల తారకరామారవు ప్రసంగించారు.  
telangana-news-pre-poll-news-kodangal-constituency
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యేకించి కొడంగల్ రాజకీయ ప్రచారం వేడెక్కింది. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయాలను మరింత రసవత్తరంగా మారి ఎన్నికల క్షేత్రం రనరంగమే అయింది. నేడు బుధవారం సాయంత్రం మంత్రి కేటీఆర్‌ వికారాబాద్ జిల్లా కొడంగల్‌ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈదొక భారీ ఎన్నికల ప్రచార రోడ్‌-షో అని చెప్పొచ్చు. 


మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరు అవుతుందని మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. ఈ ఎన్నికలు ఆషామాషీ కాదని, మన తల రాత ను మనమే రాసుకునే ఎన్నికలని చెప్పారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు కేటీఆర్ రోడ్-షోకు భారీగా తరలి రావడంతో కొడంగల్ రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. తమ టి అర్ ఎస్ సభ్యుడు పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా కెటిఆర్ నిర్వహించిన ఈ రోడ్‌-షోకు భారీగా తరలివచ్చిన జనం సమక్షంలో కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. 

telangana-news-pre-poll-news-kodangal-constituency

ఈ ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రేవంత్‌ రెడ్డి రాజకీయాలను వదిలేస్తారా? అని సవాల్‌ విసిరారు. డిసెంబర్‌ 7న రాష్ట్రంలో జరుగు తున్న ఎన్నికలు ఆషామాషీవి కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను తిట్టగానే ఎవరైనా పెద్దవారుగా పరిగణించ బడలేరా? అన్నారు. 


ప్రజాకూటమి గెలిచే అవకాశం నూరుపాళ్ళు లేదని ఒకవేళ ఊహాత్మకంగానో  పొరపాటునో ‘ప్రజా కూటమి’ గనుక విజయం సాధిస్తే తెలంగాణ ప్రజల జుట్టు చంద్రబాబు చేతి లోకి వెళ్తుందన్నారు. అంటే మళ్ళ మనం వలసపాలకుల చేతుల్లొకి వెళ్ళిపోయినట్లే అన్నారు. అరవైయ్యేళ్ళ పోరాటం బూడిదలో పోసిన పన్నీరేనని అన్నారు.  తెరాస విజయం సాధిస్తే ముఖ్యమంత్రి కేసీఆరే అన్నది నిర్వివాదాంశం.
telangana-news-pre-poll-news-kodangal-constituency
మరి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి జిల్లాకు నలుగురు చొప్పున ముఖ్యమంత్రి  అభ్యర్థులు ఉన్నారని వారిలో ఎవరు ముఖ్యమంత్రి? అని ఎద్దేవా చేశారు.  డిల్లీ గులాములు, అమరావతి బాద్‌-షాలు తెలంగాణ ప్రజలకు నాయకులవటం అవసరమా? అని ప్రశ్నించారు.  డిల్లీ దర్బారు నుండి సీల్డ్‌ కవర్ ద్వారా దిగుమతయ్యే వ్యతిని మాత్రమే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయిస్తుందన్నారు. సీల్డ్‌కవర్‌ సీఎం కావాలా? తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ సింహం కేసీఆర్‌ కావాలా? అని ప్రజలను అడిగారు. తన ప్రసంగంలో భాగంగా రంగస్థలం సినిమా గురించి కేటీఆర్ ప్రస్తావించారు. కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్, టీడీపీ ఒక వైపు, 24 గంటల కరెంట్ ఇచ్చిన టీఆర్‌ఎస్ ఒక వైపు; రైతులను రాబంధుల్లా పీక్కు తిన్న కాంగ్రెస్ ఒక వైపు, రైతు బంధు కేసీఆర్ మరోవైపు; మాటల నేతలు ఒక వైపు, చేతల కేసీఆర్ మరోవైపు; సంక్షోభం ఒక వైపు, సంక్షేమం మరో వైపు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.  ఏ గట్టున ఉంటారో? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. రైతులను 60ఏళ్ల పాటు రాబందుల్లా పీక్కుతిన్న ఆ పార్టీలవైపు ఉంటారా? రైతు బంధు కేసీఆర్‌ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని సూచించారు.  
telangana-news-pre-poll-news-kodangal-constituency
కొడంగల్‌కు నీళ్లు కావాలో, కన్నీళ్లు కావాలో తేల్చు కోవాలన్నారు. కొడంగల్‌కు కృష్ణా జలాలు రావాలంటే కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం తోనే సాధ్యం తప్ప ఎవ్వరొచ్చినా కాదన్నారు. కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే కృష్ణానది నుంచి సాగునీరు తెచ్చిఈ ప్రాంత రైతుల కాళ్లు కడిగే బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కాంగ్రెస్ పొత్తు అనైతికమని కేటీఆర్ అన్నారు. పాలమూరు ఎత్తి పోతల పథకాన్ని అడ్డు కుంటున్న టీడీపీతో పొత్తు అంటే రైతుల నోట్లో మట్టి కొట్టడమే నన్నారు. 


టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్‌ను దత్తత తీసుకుంటానని, సిరిసిల్ల తరహాలో కొడంగల్‌ను అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘కోస్గి అల్లుడు నరేందర్ రెడ్డిని మంచిగ చూస్కోండ్రి’ అంటూ నియోజకవర్గ ప్రజలకు చెప్పారు. మహాకూటమి, చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. చివర్లో కాసేపు ఉర్దూలోనూ ప్రసంగించి ఆకట్టుకున్నారు. పేదవాడికి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ రూ.5లక్షలతో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
telangana-news-pre-poll-news-kodangal-constituency
గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ పార్టీ పాలన అంటే ఏమిటో? చేసి చూపించిందని కేటీఆర్ చెప్పారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే అంతా ఆగమాగగమేనన్నారు. 


డిసెంబర్ 11 తర్వాత పింఛన్లన్నీ రెట్టింపు అవుతాయి. పింఛన్ల వయోపరిమితిని 58 ఏళ్లకు తగ్గిస్తాం. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నం. వందల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ₹ 17 వేల కోట్ల రుణమాఫీ చేసినం. రైతుల కోసం మరింత చేయాలన్నదే సీఎం కేసీఆర్ తపన  అని కేటీఆర్ చెప్పారు. 
telangana-news-pre-poll-news-kodangal-constituency
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా తీర్పును అపార్థం చేసుకుని  వివాదాస్పద తీర్పు అంటున్నారు: మేఘాలయ న్యాయమూర్తి
అప్పుడు గెలుపు కోసం రక్షణ రంగాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు జాతీయభద్రతను పణంగా పెడుతుంది
మంచి పాలనలో అరాచక శక్తులు విజృంభిస్తాయి - వీర్రాజు గారి చాణక్య నీతి
అద్దమంత అందం అందలం ఎక్కిస్తుందా! నిధీ!
గెలిస్తే తనవల్లే గెలిచిందంటారు ఓడిపోతే ఎందుకు ఓడిపోయారో చెప్పరు: చంద్రబాబు తీరు
మరోసారి స్వీటీ అనుష్క - డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా చూడబోతున్నామా!
కులగజ్జి తీవ్రస్థాయికి చేరటానికి ఏపి అధినేత నిర్వాకమే కారణం: పోసాని కృష్ణ మురళి
జగన్ పై హత్యాయత్నం కేసులో కెంద్రం సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికపై హైకోర్ట్ అసంతృప్తి
రాఫెల్ విషయంలో 36 పిటిషన్లను సుప్రీం ఏకంగా కొట్టివేత - రాహుల్ నోటికి తాళం పడ్డట్టేనా?
టుడే స్పెషల్: రాహుల్ చెంప చెళ్ళుమనిపించి - కాంగ్రెస్ కొంప కూల్చిన - రాఫెల్ డీల్ పై సుప్రీం తీర్పు
చంద్రబాబు సెల్ఫ్ డబ్బా! తారస్థాయికి చేరుతున్న కామెడీ! ఇక అసహ్యమే! జుగుప్సే!
ఇంత తెలివితక్కువ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధి సువిశాల భారతానికి నేతృత్వం వహించగలరా?
ఏపి హైకోర్టు తీర్పు టీటీడీకి చావు దెబ్బైతే - టిడిపికి మరణ మృదంగమా?
₹ 400 కోట్లతో నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం - జనాల్లో తీవ్ర వ్యతిరెఖత టిడిపికి షాక్!
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో పిచ్చి! మాడ్ అయిపోతా! - గ్రేట్ గ్లామరస్ యాక్ట్రెస్
"టీఆరెస్ ఉనికే ఉండదు!" కేసీఆర్ తో సోనియా.....చాలెంజ్!
కేసీఆర్ కు ఆయన కుటుంబమే బలం బలహీనత కూడా!
గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణా ప్రభావం?  ఆంధ్రలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?
స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం
About the author