పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు చంద్ర బాబు వెన్నుపోటు రాజకీయాలు తెలిసిందేమో ... ఇంత కంటే అమాయకుడు ఎవరుంటారు ఆంధ్ర రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి తెలుసు బాబు గారి వెన్నుపోటు బుద్దులు. అయితే  రాజకీయాల్లో చంద్రబాబు కారణంగా 'వెన్నుపోటు'కి గురైనవారి లెక్క తీస్తే, అది చాంతాడంత వుంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌ కావొచ్చు, జాతీయ పార్టీ బీజేపీ కావొచ్చు, వామపక్షాలు కావొచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి కావొచ్చు.. ఇంకో పార్టీ కావొచ్చు.. ఇవన్నీ చంద్రబాబు వెన్నుపోట్లకు విలవిల్లాడినవే.

చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?

ఆ అనుభవంతోనే పవన్‌కళ్యాణ్‌కి చాలామంది సలహాలిచ్చారు 2014 ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా. కానీ, అప్పట్లో చంద్రబాబు 'మాయ'లో కొట్టుమిట్టాడిన పవన్‌, ఆ 'మైకం' నుంచి బయటకు రాలేకపోయారు. బయటకొచ్చాక.. పవన్‌కళ్యాణ్‌కి 'చంద్ర పోటు' తాలూకు నొప్పి ఏంటో తెలుస్తోంది. తాజాగా చెన్నయ్‌ వెళ్ళిన పవన్‌, అక్కడినుంచి తాను వెన్నుపోటుకి గురైన విషయాన్నీ, చంద్రబాబులోని 'రెండు కోణాల్నీ' తలచుకుంటూ ఆవేదన చెందారు. 'చంద్రబాబు ఎప్పుడు శతృవుగా వ్యవహరిస్తారో, ఎప్పుడు మిత్రుడిలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోలేం.


పవన్ అజ్ఞానం కు మరో నిదర్శనం ...!

తనకు ఎలాక్కావాలంటే అలా చంద్రబాబు మార్చేసుకుంటారు.. చంద్రబాబుకి విలువల్లేవ్‌.. విశ్వాసం లేదు..' అంటూ పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించడంతో ఎవరూ పెద్దగా అవాక్కవలేదుగానీ, కాస్త లేటుగా పవన్‌కళ్యాణ్‌కి జ్ఞానోదయం అయ్యిందని మాత్రం అనుకుంటున్నారు. చంద్రబాబుతో స్నేహం వద్దు మొర్రో..' అని స్వయానా చిరంజీవే, చెప్పినా పవన్‌కళ్యాణ్‌ వినలేదాయె. అన్నయ్య మాటని సైతం తమ్ముడు పవన్‌ లెక్క చేయనంతగా చంద్రబాబు తనదైన 'మాయ'లో ఇరికించేశారు మరి. రెండు మూడేళ్ళ క్రితం చంద్రబాబు గురించి పవన్‌కళ్యాణ్‌ తెలుసుకుని వుంటే, తెలుసుకుని.. రాజకీయంగా తన పంథా మార్చుకుంటే పరిస్థితి ఇంకోలా వుండేదేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: