పవన కళ్యాణ్ చెన్నై కు ఎందుకు వెళుతున్నాడని చాలా మందికి అర్ధం కాలేదు. నిజానికి అంత సేపు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ చర్యలు అలా ఉంటాయి కాబట్టి వాటి వెనుక వ్యహాలు ఉంటాయని అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు.  పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నట్లుండి చెన్నయ్ వెళ్లారు. అలా అని జాతీయ రాజకీయాల కోసం కాదు. తన మాటలు తాను చెప్పుకోవడానికి. తాను ఆంధ్ర సిఎమ్ గా పోటీ చేయబోతున్నా అని ప్రకటించారు. కానీ ఎవ్వరూ సిఎమ్ గా పోటీ చేయారు. తన తరపున మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని, అప్పుడు తాను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికై, సిఎమ్ అవుతారు. 


పవన్ అజ్ఞానం కు మరో నిదర్శనం ...!

కానీ పవన్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆంధ్రలో ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర మీద పెట్టిన దృష్టి ఆయన మరే జిలాల్ల మీద పెట్టలేదు. గతంలో ఎప్పుడో అనంతపురం మీద హడావుడి చేసారు. ఆ తరువాత అది మరచిపోయారు. కృష్ణ, గుంటూరు జిల్లాల మీద దృష్టి పెట్టి, అక్కడ ఇంటికి, ఆఫీసుకు శంకుస్థాపన చేసి, ఆ సంగతి పక్కన పెట్టారు. ఆంధ్ర అంటే ఇంకా చాలా జిల్లాలు వున్నాయి. పార్టీ నిర్మాణం లేదు. బాధ్యులు లేరు. అభిమానులు వున్నారు. కేవలం వాళ్లు వుంటే చాలదు. పార్టీ నిర్మాణం, అభిమానులను ఓటర్లుగా మార్చే వ్యవస్థ వుండాలి,. ఆ దిశగా ఆయన అస్సలు ఆలోచించడం లేదు.

పవన్ అజ్ఞానం కు మరో నిదర్శనం ...!

చాలా విషయాలు పవన్ లైట్ తీస్కుంటారు. సింపుల్ గా వదిలేస్తారు. అనకాపల్లి వెళ్లి దాడి వీరభద్రరావును పార్టీలోకి పిలిచారు. కానీ ఈ రోజుకు ఆయన రాలేదు. పవన్ మాట మాత్రం పోయింది. ముత్తా గోపాల కృష్ణ వచ్చారు. కొన్నాళ్లు ఆయనను వెంటేసుకున్నారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వచ్చారు. ఆయనను వెంటేసుకు తిరుగుతున్నారు. ఇలా కొత్త నీరు వచ్చినపుడల్లా, పాత నీటిని పక్కన పెడుతున్నారు. దీంతో ఎవరికీ కూడా పార్టీ మీద సీరియస్ నెస్ లేకుండా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: