చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన నరజాతి మనుషులు కొందరు ఇంకా అలాగే ఉండిపోయారు. కొంత మానవాభివృద్ధి తరవాత పరిణామ క్రమం ఆగిపోయి ఉండటంతో అడవిజాతిగానే మిగిలిపోయారు. రాతియుగం నాటి మనుషులు ఎలా ఉంటారు. జంతువులను వేటాడి పచ్చి మాంసం తింటారు. అడవుల్లో ఉంటారు. పశు  ప్రవర్తన. ఒంటి మీద బట్టలు వేసుకోవడం తెలీదు. ఆకలేస్తే వేటాడి  తినడం, నిద్రవస్తే నిద్రించటం, దేహం కోరుకుంటే మైధునం అంతకు మించిన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, బావోద్వేగాలు అసలే వారికి తెలయవు లేదా ఉండవు.
Image result for sentinelese tribe
పూర్తి అడవి కౄరమృగాల తరహా జీవనం. ఇలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మగలరా?  ఏవరైనా? నమ్మకాలకు అపనమ్మకాలకు సంభంధం లేకుండా వారి ప్రవర్తన అలాగే ఉంటుంది.  మన అండమాన్ నికోబార్ దీవుల్లోని  ఉత్తర సెంటినల్ ఐలాండ్  ప్రాంతంలో ఉండే “సెంటినల్ తెగ ప్రపంచం లోనే అత్యంత కౄరమైన ప్రమాదకరమైన మానవరూప ఆదిమజాతి. 

Image result for sentinelese tribe

బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవించే ఈ ఆటవిక తెగ అమెరికాకు చెందిన ఒక పర్యాటకుణ్ని కిరాతకంగా హత్య చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సాహసయాత్ర నిమిత్తం తాజాగా అండమాన్‌ నికోబార్‌ దీవులకు వచ్చిన అమెరికా సాహస యాత్రికుడు జాన్ అనెన్ చౌ ను వీరు దారుణంగా హత్య చేశారు. నార్త్‌ సెంటినెల్‌ ఐలాండ్ లో సెంటినెలీ తెగ కు చెందిన ప్రజలపై పరిశోధనకు గాను ఆ సాహస యాత్రికుడు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

Related image

ఈ తెగ జాన్ అనెన్ చౌ ను కిరాతకంగా హత్య చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఈ విషయం చర్చనీయాంశం  అయింది.  ఆధునాతన కంప్యూటర్ల యుగంలోనూ సమాంతరంగా రాతియుగం నాటి మనుషుల రూపురేఖలతో, ఆహార విహారాలతో జీవన విధానంతో అలాగే బతుకుతున్నతెగ ఒకటి ఇంకా ఈ భూమిపై ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.. 

Image result for john anen chow killed by sentinental tribe in andamans

john anen chow killed by sentinental tribe in andamans

Image result for sentinelese tribe
కథల్లో వినడం, సినిమాల్లో చూడటం తప్ప ఇప్పటికీ ఇలాంటి మానవ జాతి ఉందంటే మన తరం నమ్మటం కష్టమే.  కాని, వీరి ఉనికి నిజం. మరి ఈ సెంటినల్ తెగ ఇప్పటి కీ అలా ప్రపంచానికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? అసలు వీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఈ కోణంలో అనేక మంది పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు కొంత  ఆసక్తికరమైన, మరి కొంత భయంకర కోణాలు వివరాలు వెల్లడించారు. 
Sentinelese
సెంటినల్ తెగపై పరిశోధనలు చేసి వారి రహస్యాలు తెలుసుకుందామని ప్రయత్నించిన చాలా మందికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ తెగవారు తమ దీవిలోకి కొత్త మనిషిని రానివ్వరు. ధైర్యం చేసి వెళ్లిన వాళ్లు ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. 
Image result for sentinelese tribe
*1896లో ఒకసారి అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు పడవల్లో ఈ దీవి చేరారు. ఈ తెగ ప్రజల గురించి అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియకపోవటంతో సాధారణంగా దీవిలో అడుగు పెట్టడంతో పోలీసులపైకి ఒక్కసారిగా బాణాలు రయ్, రయ్ మంటూ దూసుకొచ్చాయి. వారికి ఏం జరుగు తుందో తెలిసే లోగానే వారి శరీరాలను శరపరంపర జల్లెడ చేసేశాయి. ఆ భయానక తెగ ఉనికి గురించి తెలిసింది ఆనాడే.  అప్పటి నుండి ఆ దీవి సమీపానికి మాత్రమే గాదు ఆ దిశగా వెళ్లడానికి ఎవరూ సాహసం చేయలేదు.  ఆ తెగ పేరుతోనే ఆ దీవిని “సెంటినల్ ఐలాండ్” గా పిలవడం ప్రారంభించారు. 
Image result for sentinelese tribe
ఈ సెంటినల్ తెగ ఉనికి 1974 లో మరోసారి బయటపడింది. ఒక సినిమా బృందం షూటింగ్ నిమిత్తం సెంటినల్ దీవి సమీపంలోకి వెళ్లింది. వారిపై ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు. దీంతో వాళ్లంతా భయంతో పడవలెక్కి వెనక్కి వచ్చేశారు. సినిమా బృందానికి జరిగిన అనుభవం తర్వాత, వారిపై మానవ పరిణామ శాస్త్రవేత్తలు ఇతరులు పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని అనుమతించింది. వారిని కూడా తెగ ప్రజలు భయపెట్టడంతో, ఆపై దీవిలోకి ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది. 
Image result for sentinelese tribe
2004లో అండమాన్ నికోబార్ దీవులను భారీ సునామీ ముంచెత్తిన సమయంలో ఆ ప్రాంతంలో సునామీ బాధితుల సహాయార్థం ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లా లను హెలీకాప్టర్ల ద్వారా జారవిడిచింది. సెంటినల్ దీవి దిశగా వెళ్లిన హెలికాప్టర్‌ పై కూడా ఆ జాతి జనులు భయంతో బాణాలు వేశారు  సెంటినల్ తెగ మూలాలు ఎక్కడివి? ఎక్కడి నుండి వీరు ఈ ప్రాంతానికి చేరుకున్నారు అనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ తెగకు చెందినవారు సుమారు 60 వేల ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినట్టు చాలా మంది చరిత్ర కారులు చెబుతున్నారు. వీరి ఆహార్యం, శరీరరంగు కూడా ఆఫ్రికాలోని కొన్ని గిరిజన తెగల ప్రజలకు పోలి ఉండటంతో ఎక్కువ మంది ఇదే నిజమని భావిస్తున్నారు. 
Image result for sentinelese tribe
సెంటినలీస్ తెగ ప్రజల ప్రధాన జీవనాధారం వేట. అడవిలోని జంతువులనే ఆహారంగా తీసుకుంటారు. వీటితో పాటు అడవిలో లభించే పండ్లు, తేనె, చేపలను ఆహారం గా తీసుకుంటారు. విల్లు, బాణాలు వీరి ఆయుధాలు. వీరి మాట్లాడే భాష, బాషో? అరుపులో? కేకలో? ఎవరికి అర్ధం కాలేదు. సెంటినలీ తెగ జనాభా అక్కడ 400 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి వీరి జనాభాను గణించడానికి గతంలో ప్రయత్నాలు జరిగగా కేవలం 39 మందిని మాత్రం గుర్తించగలిగారు. 

Image result for sentinelese tribe

ది మేటింగ్ సీజన్ - మైధునక్రియ -సెంటినలీస్ తెగ

మరింత సమాచారం తెలుసుకోండి: