అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో పాకిస్థాన్ దేశానికి షాకిచ్చారు . ఉగ్రవాదులకు అండగా ఉంటూ ప్రత్యర్ధి దేశాల పై విరుచుకు పడిన పాకిస్థాన్ దేశానికి ఐక్యరాజ్యసమితిలో అనేక సార్లు వివిధ దేశాలు ఉగ్రవాదుల విషయంలో చీవాట్లు పెట్టిన సంగతి మనకందరికీ తెలిసినదే.

Image result for donald trump

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదులకు అండగా ఉంటున్న పాకిస్థాన్ దేశానికి భద్రతా సహాయాన్ని నిలిపివేశారు. ఇటీవల ఏకంగా 166 కోట్ల డాలర్ల రూ.11818 కోట్లు) భద్రతా సహాయాన్ని నిలిపివేస్తూ అమెరికా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్ ప్రకటన విడుదల చేసింది.

Related image

ఇప్పటి వరకు అమెరికా కోసం పాకిస్తాన్ దేశం చేసింది ఏమీ లేదని అమెరికా దేశంలో అతిపెద్ద మారణకాండ సృష్టించిన కోసమా ఒసామా బిన్ లాడెన్ విషయంలో అమెరికా దేశానికి పాకిస్తాన్ సహకారం అందించలేదని గతంలోనే స్పష్టం చేశారు డోనాల్డ్ ట్రంప్.

Related image

అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం  భద్రత సహాయాన్ని పాకిస్థాన్ కు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు షాక్ కి గురి చేసింది. అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రోబ్ మానింగ్ మీడియాకు పంపిన ఈ మెయిల్ లో ఈ అంశాన్ని వెల్లడించారు. ‘పాకిస్థాన్ కు అందజేస్తున్న 166 కోట్ల డాలర్ల భద్రతా సహాయాన్ని నిలిపేస్తున్నాం’ అని అందులో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: