చంద్రబాబు మార్క్ రాజకీయాల ముందు ఎవరూ నిలవలేరన్నది మరో మారు రుజువవుతోంది. బంధాలతో సంబంధాలను  పెనవేయడంలో ఆయనకు ఆయనే సాటి.  వ్యవహారాన్ని చాలా తెలివిగా మలుపులు తిప్పుతూ టీడీపీ గూటికి మళ్ళీ అందరినీ చేర్చే రాజకీయ చతురత బాబుకే సొంతం. ఇపుడు జరుగుతున్నదంతా చూస్తుంటే బాబు వ్యూహాలు బాగానే పారుతున్నాయనిపిస్తోంది.


ట్రంప్ కార్డ్ :


తెలంగాణాలో ఎన్నికలు జరగడం ఒక ఎత్తు. నందమూరి రక్తం పంచుకున్న హరిక్రిష్ణ కూతురు సుహాసినిని పోటీకి దించడం మరో ఎత్తు. అసలు ఎన్నికల సంగతి ఎలా ఉన్నా బాబు మంత్రాంగంతో రేపటి ఏపీ ఎన్నికలకు అవసరమైన  బలాన్ని, బలగాన్ని మెల్లగా కూడగట్టుకుంటున్నారు. దూరమైన నందమూరి వారి మూలాలను ఒక్కొక్కరుగా దగ్గరకు చేర్చాలనుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టీ చూస్తే  అందులో ఇపుడు బాబు సక్సెస్ అవుతున్నట్లే.


మేనత్త మద్దతు :


కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న చుండ్రు (నందమూరి) సుహాసినికి మేనత్త దగ్గుబాటి పురంధేస్వరి మద్దతు ప్రకటించడం ఇందులో భాగంగా చూడాలి. ఉప్పూ నిప్పులా ఉండే వదినా (పురంధేశ్వరి) మరిది (బాబు) ల సంబంధాలకు సుహాసిని మధ్యలో నిలిచి మళ్ళీ కలిపేలా ఈ పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీలు వేరైనా నా దీవెనలు సుహాసినికి ఎపుడూ ఉంటాయని, ఓ మేనత్తగా ఆమె విజయాన్ని ఆశీర్వదిస్తున్నానని పురంధేశ్వరి చెప్పడం ద్వారా అక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్ధికి నైతికంగా దెబ్బ తీసేశారు. మరో వైపు సుహాసినికి కొత్త బలాన్ని ఇచ్చారు.


అసలు వేట అతనే :


ఇక ఈ మొత్తం ఎపిసోడ్ అంతా జూనియర్ నందమూరి కోసమేనన్నది అందరికీ తెలిసిందే. టీడీపీకి గత పదేళ్ళుగా దూరంగా ఉంటూ వస్తున్న జూనియర్ ని బాబు బాగా ఇరకాటంలో పెట్టేశారు. ఉంటే ఆయన అందరితో కలసి బాబు బాటకు రావాలి. లేకపోతే ఏకంగా హరిక్రిష్ణ కుటుంబం నుంచి దూరమైపోవాలి. ఇదీ ప్లాన్. ఇవాళ మేనత్త  పురంధేశ్వరి మద్దతు పలికారు, రేపు కళ్యాణ్ రాం ముందుకు వస్తారు. అపుడు మిగిలేది జూనియర్ ఒక్కడే. ఆయన కూడా మద్దతు ఇస్తే ఇంక బాబుకు ఎదురు ఉండదు. రెండు దశాబ్దాల తరువాత నారా, నందమూరి కుటుంబాలు ఒక్కటై 2019 ఎన్నికల్లో  కలసికట్టుగా పోరాడేందుకు రంగం సిధ్ధమైపోతుంది. ఇదే బాబు ప్లాన్.


మరింత సమాచారం తెలుసుకోండి: