ముందస్తు ఎన్నికల్లో అధికారికి అభ్యర్ధులను తిరుగుబాటు అభ్యర్ధులు వణికిస్తున్నారు. ఒకవైపు మహాకూటమి అభ్యర్ధులు, మరోవైపు టిఆర్ఎస్ అభ్యర్ధులు పోటీలో ఉండటంతో రెబల్ అభ్యర్ధులు కీలకమయ్యారు. రాబోయే ఎన్నికలు టిఆర్ఎస్ అభ్యర్ధులతో పాటు మహాకూటమి అభ్యర్ధులకు కూడా చాలా కీలకం. గెలుపు కోసం రెండు వైపుల అభ్యర్ధులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గెలుపోటముల మధ్య ఉండే తేడా కూడా వెంట్రుక వాసి మాత్రమే. ఇటువంటి పరిస్ధితుల్లో ఏ వైపు నుండి వేసినా రెబల్ అభ్యర్ధులు ఇతరులకు వణుకు పుట్టిస్తున్నారు.

 

పైగా రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్ వేసిన వాళ్ళు కూడా మామూలు అభ్యర్ధులు కారు. దాదాపు అధికారిక అభ్యర్ధులంత గట్టివారే. మరి కొన్ని చోట్ల అధికారిక అభ్యర్ధులకన్నా బలవంతులే. దాంతో  ఏ పార్టీ నుండి రెబల్ పోటీలో నిలిచారో అదే పార్టీ తరపున అధికారిక అభ్యర్ధి వణికిపోతున్నారు. చేవెళ్ళల్లో జరిగిందదే. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ అసెంబ్ల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ తాజా మాజీ ఎంఎల్ఏ మహాకూటమి అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నుండి పడాల వెంకటస్వామి ఎప్పటి నుండో టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. పడాలను కాదని ఢిల్లీ పెద్దలు కూడా టిఆర్ఎస్ లో నుండి వచ్చిన రత్నంకే ప్రాధాన్యత ఇచ్చి టిక్కెట్టు కట్టబెట్టారు. దాంతో పడాలకు ఒళ్ళుమండిది.

 

అనుకున్నదే తడవుగా వెంటనే పడాల వెంకటస్వామి రెబల్ అభ్యర్ధిగా నిమినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నేతలు, శ్రేణుల్లో మెజారిటీ పడాల వెంట నిలవటంతో అధికారిక అభ్యర్ధి రత్నానికి ఇబ్బందిగా తయారైంది. అందుకనే పడాలతో నామినేషన్ ఉపసంహరణకు చాలా ప్రయత్నాలే చేశారు. అయినా వర్కవుట్ కాలేదు. దాంతో రత్నం గట్టి ప్లాన్ వేసి కాంగ్రెస్ లోని సీనియర్ నేతలందరినీ తీసుకుని పడాలింటికి వెళ్ళి అందరి ముందు ఏకంగా కాళ్ళు పట్టేసుకున్నారు. అప్పుడు తీసిన ఫొటో మొత్తానికి బయటకు వచ్చేసి వైరల్ గా మారిపోయింది.  ఉపసంహరణలకు చివరి రోజు కావటంతో ఈరోజు తేలిపోతుంది అధికార అభ్యర్ధుల తలరాతేంటో.


మరింత సమాచారం తెలుసుకోండి: