ఏపీలో ఓ పార్టీది విచిత్రమైన పరిస్థితి. ఆ పార్టీ నిన్నటి వరకూ హ్యాపీగా విమర్శలు చేసేది. తెల్లారిలేస్తే తిట్ల దండకం అందుకునేది. అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ పెద్ద గొంతు చేసేది. ఇపుడు సీన్ మారింది తిట్టే పార్టీ కాస్త దోస్తీ గా మారిపోయింది. దాంతో  కళ్ళ ముందు అంతా శూన్యం, పక్క నున్న వారికే తిట్టాలి. ఇపుడు అదే పని చేస్తున్నా లాజిక్ కుదరడం లేదు.


బాబు మీద ప్రేమ:


ఎవడైనా ఎదగాలంటే ఆకాశం వైపు చూస్తాడు.  ప్రతిపక్షంలో ఉన్న వాడు అధికార పక్షాన్నే నిందిస్తాడు. ఎన్ని మంచి పనులు చేసినా ఇంకా ఏదీ చేయలేదంటూ విరుచుకుపడతారు. ఆ విధంగా జనంలోకి వస్తాడు, ప్రజల్లో కూడా ఫోకస్ అధికార పార్టీ మీదనే ఉంటుంది కాబట్టి వారు కూడా తొందరగా కనెక్ట్ అవుతారు. ఆ విమర్శలకు లాజిక్ కూడా ఉంటుంది. చూడబోతే కాంగ్రెస్ కు ఆ అవకాశం ఏపీలో లేనట్లుంది. వారు ఇపుడు బాబుకు జిగినీ దోస్తీలు, అందువల్ల పల్లెత్తు మాట అనలేరు. అలాగనీ ఉఊరుకోలేరు. తిరిగే కాలు, తిట్టే నోరు అన్న చందంగా వారు తెల్లారి లేస్తే మీడియా బేబీల్లా మీటింగులు పెట్టాలి. నాలుగు విమర్శలు చేయాలి. ఇపుడు అదే చేస్తున్నారు.


వైసీపీ  మీద :


ఉరుము ఉరిమి మంగళం మీద పడిందని వైసీపీ మీదనే ఇపుడు ఏపీ కాంగ్రెస్ టార్గెట్ చేసింది. జగన్ నామ స్మరణతో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నుంచి తులసిరెడ్డి వరకూ అంతా తరించిపోతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తే లాభమేంటని ఓ నేత అంటారు. బోలెడు డబ్బు ఖర్చు అని మరో నాయకుడు సెటైర్లు వేస్తాడు, ముఖ్యమంత్రి కోసమే ఈ తపన అంటాడు. ఇలా తలా తోకే లేని విమర్శలు చేస్తూ పొద్దు పుచ్చుతున్న కాంగ్రెస్ నేతలు తాము జనంలో నవ్వుల పాలు అవుతున్నామని మాత్రం గుర్తించడంలేదు


నోళ్ళు కట్టేశారా:


నిజానికి కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎంత ఎక్కువో అందరికీ ఎరుకే. హైకమాండ్ తెచ్చి పెట్టిన సీఎంలనే తీసి పారేసేలా మాట్లాడే నేతలు ఇపుడు ఇంకా పొడవని పొత్తు ను చూసి జడుసుకుంటారా. మాటలు దాచేసుకుంటారా అది కాదు అసలు విషయం. రేపు ఏపీలో ఎమ్మెల్యే కావాలన్నా, సీటు దక్కాలన్నా బాబు గారి ప్రాపకం కావాలి. ఆయన టిక్కు పెడితేనే టికెట్టు, ఆయన పార్టీ బలంతోనే గెలుపు, ఈ సంగతి తెలిసే రఘువీరా నుంచి అంతా ఇపుడు బాబును పల్లెత్తు మాట అనకుండా  భజన చేస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: