మహాకూటమిలోని తెలుగుదేశంపార్టీ ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పెద్ద షాకే ఇఛ్చింది.  తాను పోటీలో నుండి తప్పుకుంటున్నట్లు టిడిపి అభ్యర్ధి సామా రంగారెడ్డి చేసిన ప్రకటనతో కాంగ్రెస్ నెత్తిన పిడుగు పడినట్లైంది. ఎందుకంటే, ఇబ్రహింపట్నంలో పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలే గట్టి ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ స్ధాయిలో గొడవలు పడ్డారు. అయినా ఉపయోగం లేకపోయింది. పొత్తుల్లో భాగంగా ఆ స్ధానాన్ని టిడిపికి కాంగ్రెస్ వదులుకోవాల్సొచ్చింది. దాంతో తెలుగుదేశంపార్టీ ఇబ్రహింపట్నం స్ధానంలో సామా రంగారెడ్డికి బిఫారం ఇచ్చింది.

 

అయితే సామా మనసంతా ఎల్బీ నగర్ నియోజకవర్గం మీదే ఉంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పోటీ చేయాలని సామా రంగారెడ్డి చాలా గట్టిగానే ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఈ స్ధానాన్ని కాంగ్రెస్ కు టిడిపి వదిలేసుకుంది. దాంతో ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సరే అధికారిక అభ్యర్ధుల విషయాన్ని పక్కన పెడితే చాలా చోట్ల రెబల్ అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు. వారిని పోటీలో నుండి తప్పించటానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. మొత్తానికి చాలా చోట్ల రెబల్స్ చల్లబడి తప్పుకున్నారు.

 

అయితే, ఇక్కడే కాంగ్రెస్ కు టిడిపి అభ్యర్ధి సామా రంగారెడ్డి పెద్ద షాక్ ఇచ్చారు.  నామినేషన్లు వేశారు ప్రచారం కూడా చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యింది. ఈ దశలోనే సామా ఓ ప్రకటన చేశారు. తాను ఇబ్రహింపట్నంలో పోటీలో నుండి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు. అధికారిక అభ్యర్ధి అందులోను ఉపసంహరణలు పూర్తయిన తర్వాత పోటీలో నుండి తప్పుకుంటున్నారంటే ఏమనర్ధం ? అదేదో ఉపసంహరణలకు గడువుండగానే చెప్పుంటే కాంగ్రెస్ రెబల్  అభ్యర్ధినే పోటీలో ఉంచేవారు కదా ? చివరి వరకూ బిఫారం కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్డి చివరకు బిఎస్పీ తరపున నామినేషన్ వేసి పోటీలో ఉన్నారు. సామా దెబ్బకు చివరకు కాంగ్రెస్ పార్టీ మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతు ప్రకటించి ఓట్లడుగుతోంది. మరి మిగిలిన సీట్లలో అన్నా టిడిపి గట్టి పోటీ ఇస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: