చంద్రబాబునాయుడుకు షాక్ కొట్టే న్యూసే ఇది. తొందరలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. ఉండవల్లి గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, రాజమండ్రికి రెండు సార్లు ఎంపిగా పనిచేసిన ఉండవల్లి చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఏ రాజకీయ పార్టీలోను లేరనే చెప్పాలి. అయితే, చంద్రబాబు పాలనలోని లోపాలను, అవినీతి తదితరాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. అంశమేదైనా సరే పాయింట్ బై పాయింట్ మాట్లాడటం, చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పటం ఉండవల్లి లక్షణం.

 

తన వాదనా పటిమతో అందరినీ మెప్పిస్తుంటారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో అంశాలను, లోపాలను, అవినీతిని ఉండవల్లి తనదైన పదునైన వాగ్దాటితో చంద్రబాబు గాలి తీసేశారు. ఉండవల్లి చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై చంద్రబాబు కానీ లేదా టిడిపి నేతల నుండి కానీ ఎటువంటి సమాధానం ఉండదు. అంటే మాజీ ఎంపి వాదన లాజికల్ గా అంత పకడ్బందీగా ఉంటుంది. ఏ పార్టీకైనా ఉండవల్లి లాంటి వాళ్ళు ప్లస్సవుతారనటంలో సందేహం అక్కర్లేదు. పోలవరం అవినీతిపైన, జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన విషయంలో కూడా ఉండవల్లి వాదనకు టిడిపి నుండి సమాధానమే లేదు.

 

ఎటూ ఉండవల్లి ఏ పార్టీలోను లేరు. షెడ్యూల్ ఎన్నికలేమో దగ్గరకు వచ్చేస్తున్నాయ్. ఈ నేపధ్యంలోనే వైసిపిలో చేరే విషయంలో ఉండవల్లికి జగన్ ఆహ్వానం పంపారట. వైఎస్సార్ సన్నిహిత కోటరీలో ఉండవల్లి ఎంతటి కీలకంగా ఉండేవారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఉండవల్లి గనుక వైసిపిలో  చేరితే కచ్చితంగా జగన్ కు బాగా ఉపయోగమనే చెప్పాలి. ఇపుడు మాజీ ఎంపి హోదాలోనే ఉండవల్లి కౌంటర్లకు టిడిపి సమాధానం చెప్పలేకపోతున్నారు. అదే ఉండవల్లి గనుక వైసిపిలో చేరితే చంద్రబాబు అండ్ కో పరిస్ధితి ఎలాగుంటుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: