కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్ బబ్బర్ ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అసలు సంగతేమంటే ఇటీవల భోపాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశానికి హాజరైన రాజ్ బబ్బర్, కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
Image result for raj babbar compares rupee value with age of Modi mother
ఆసందర్భంగా, ఆయన "ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పడిపోతున్న రూపాయి విలువను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వయసుతో పోల్చారు. కానీ ఈ రోజు రూపాయి విలువ నరేంద్ర మోదీ అమ్మగారి వయసంతకు పడిపోయింది" అంటూ దేశ ఆర్థిక వ్యవస్థలో పడిపోతున్న రూపాయి విలువను ప్రధాని మోదీ తల్లిగారి వయసుతో పోల్చిచెప్పారు.
Image result for raj babbar & Modi's mother
అనంతరం ఆయోధ్య రామమందిర నిర్మాణం గురించి కూడా మాట్లాడారు. "ఆలయ నిర్మాణానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇప్పుడు ముస్లింలు కూడా రామమందిర నిర్మాణం నిర్వివాదంగా జరగాలని కోరుకుంటున్నారు. బీజేపీ ఆలయాన్ని నిర్మిస్తానంటుంది కానీ ఎప్పుడనేది ఇప్పటికీ చెప్పడం లేదు" అంటూ ఆరోపించారు. అయితే సినీ నటుడు కాంగ్రెస్ రాజకీయవేత్త రాజ్‌ బబ్బర్‌ మాటలపై బీజేపీ మండి పడుతుంది. సభ్యత మరచి వయోవృద్ధుల ను అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకురావటాన్ని బిజెపి క్షమించ లేకపోతుంది.
Image result for raj babbar & Modi's mother
అందుకే తక్షణం రాజ్ బబ్బర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నీచ మనస్తత్వాన్ని ఈ వ్యాఖ్యలే అద్ధం పడుతున్నాయని వీరి స్వభావానికిదే నిదర్శనమని బీజేపీ నేతలు కాంగ్రెస్ రాజకీయ నాయకులపై మండిపడుతున్నారు. 

Image result for raj babbar & Modi's mother

మరింత సమాచారం తెలుసుకోండి: