తెలంగాణా ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుధ్ధ వాతావరణాన్నే తలపిస్తున్నారు. ఆ వైపు, ఈ వైపు మోహరించిన బలగాలతో విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా టీయారెస్, మహా కూటమి పోరాడుతున్నాయి. టీయారెస్ కి స్టార్ కాంపెనియర్గా మాటల మాంత్రికుడు కేసీయార్, దూకుడు గా పాలిటిక్స్ చేసే కేటీయార్ ఉన్నారు. కాంగ్రెస్ కి ఆ కరవు తీర్చేందుకు ఈ రోజు సాయంత్రం సోనియ గాంధీతో భారీ సభ పెడుతున్నారు. దాంతో కీలకమైన ఘట్టం ఆవిష్కరణ జరుగుతోంది.


తెలంగాణా ఇచ్చిన దేవత :


సోనియాగాంధీ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి సారి సభల్లో పాల్గొంటున్నారు. పైగా ఆమె ఉత్తరాదిన ఎన్నికలు జరుగుతూంటే కేవలం తెలంగాణాకు మాత్రమే రావడం ఇపుడు ఇంటెరెస్టింగ్ గా ఉంది. ఆమెకు ఎంతలా కసి, పట్టుదల లేకపోతే తెలంగాణాకు వస్తారన్నది ఇక్కడ ప్రశ్న. తన వద్దకు వచ్చి తెలంగాణాను సాధించుకుని ఆనక తెప్ప తగలేసి ఒంటరి పోరుతో అధికారం ఎగరేసుకుపోయిన కేసీయార్ కి గట్టి షాక్ ఇవ్వడానికే సోనియాగాంధి వస్తున్నారని అంటున్నారు. 


అయిదు రాష్ట్రాలు ఒక ఎత్తు, తెలంగాణాలో గెలుపు మరో ఎత్తు అందుకే సోనియా ఇక్కడకు అడుగు పెట్టారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణాను ఇచ్చిన కాంగ్రెస్ కు ఈసారి జనం ఓటేస్తారని ఆమె నమ్మకంగా ఉన్నారు. ఈ రోజు సభంలో కేసీయార్ సర్కార్ దుమ్ము దులిపేయబోతున్నారని టాక్. అదే జరిగితే టీయారెస్ కష్టాల్లో పడినట్లే.


పేలవంగా :


మరో వైపు టీయారెస్ లో పెద్ద తలకాయలు కేసీయార్, కేటీయార్ ప్రసంగాలు పేలవంగా మారిపోతున్నాయి. కేసీయర్ ఓటమి వ్యాఖ్యలతో తలకాయ పట్టుకుంటున్న టీయారెస్ అభ్యర్ధులకు ఇపుడు కేటీయార్ గొంతు నొప్పి సమస్య పెద్ద శాపంగా మారుతోంది. ఇప్పటికే అనేక మీటింగుల్లో మాట్లాడిన కేటీయార్ సరైన సమయంలో మాట్లాడలేకపోతున్నారు. దాంతో కూటమి ప్రచారం ఓ రేంజిలో జరిగితే తమకు ఇబ్బందిగా వుంటుందని టీయారెస్ తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: