విజయసాయి రెడ్డి వైసీపీ లో రెండవ పవర్ ఫుల్ లీడర్ అని చెప్పవచ్చు. జగన్ తరువాత పార్టీ వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటాడు. అయితే వివిధ అంశాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా - ఆయన పరిపాలనను వ్యవస్థీకృతంగా విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు రాజకీయ - పార్టీ పరమైన నిర్ణయాలను పలు ట్వీట్లలో విశ్లేషించారు. వివిధ రకాలైన ప్రతిపాదనలు - సెటైర్లు - విమర్శలతో వరుసగా విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు.

Image result for vijayasai reddy

కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న తీరును విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ``చంద్రబాబు కాంగ్రెస్ కు సరెండర్ అయిపోయి - రాహుల్ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ ‘యూ-టర్న్ అంకుల్’ మరో చారిత్రక ‘యూ టర్న్’కు సిద్ధపడిపోతున్నాడు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీలోనే తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.`` అంటూ సంచలన ట్వీట్ చేశారు. అదే సమయంలో బాబు జాతీయ పార్టీల దోస్తీని సైతం విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


``దేశాన్ని రక్షించాలి....ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఎవరంటున్నారు ఈ మాటలు? నాలుగున్నరేళ్ళలో ప్రజాధనాన్ని విచ్చల విడిగా దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి - ప్రజలను నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిన అరివీర సూడో మీడియా ప్రజాస్వామ్యవాది...చంద్రబాబే!``` అని వ్యాఖ్యానించారు.  ``దొంగ హామీలు - నోరు విప్పితే అబద్దాలు...ఈ కళలో చంద్రబాబు మాస్టర్. 2014లో బాబు చేసిన దొంగ వాగ్దానాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు నమ్మారు. అలాగే 2019 ఎన్నికలలో బాబును బంగాళాఖాతంలో విసిరేయాలని కూడా ఒట్టేసుకున్నారు.`` అని ఆయన విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: