సోనియా గాంధీ ప్రసంగం నిజంగా మాటల తూటాల్లా సాగిందని చెప్ప వచ్చు. సోనియా ప్రసంగం ముందు ఎవరు పనికి రాలేదు. . సోనియా ప్రసంగిస్తున్నంతసేపూ మాటలు తూటాల్లా పేలాయనడం అతిశయోక్తి కాదేమో. చివరికి రాహుల్ గాంధీ కూడా తేలిపోయాడంటే అర్ధం చేసుకోవచ్చు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సోనియాగాంధీ తొలిసారిగా తెలంగాణకు వచ్చారు. అదీ, ఎన్నికల ప్రచారం కోసం. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ కోసం పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. అంతకు ముందు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా కాంగ్రెస్‌ నేతలు, మహాకూటమి ముఖ్య నేతలు ప్రసంగాలు చేసినా.. అసలు సోనియా, తెలంగాణ పర్యటనలో ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సోనియా ఎన్నికల ప్రచార సభ కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లు వృధా పోలేదు.. భారీగా జనం సోనియా సభకు తరలివచ్చారు.

మా త్యాగం వృధా: సోనియా ఆవేదన.!

ఎన్నికల ప్రచారంలో ఎవరేం చెప్పారు.? ఓటర్లు ఆ మాటలకు ప్రభావితం అవుతారా.? లేదా.? అన్నది వేరే విషయం. సోనియా పేల్చిన మాటల తూటాలకు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కౌంటర్‌ రావాల్సి వుంది. అప్పుడే టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు షురూ చేసేసినా, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నుంచి రావాల్సి వుంది అసలు సిసలు కౌంటర్‌. వరుసగా తెలంగాణలో క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న కేసీఆర్‌, రేపు ఖచ్చితంగా సోనియాకి కౌంటర్‌ ఇచ్చి తీరతారన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

Image result for sonia gandhi telangana sbaha

గతంలో సోనియాగాంధీని దెయ్యంగా అభివర్ణించిన కేసీఆర్‌, ఆ తర్వాత సోనియాగాంధీని దేవత.. అంటూ కొనియాడిన విషయం విదితమే. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్‌ అయ్యాక, సకుటుంబ సమేతంగా కేసీఆర్‌.. సోనియా నివాసానికి వెళ్ళారు. సోనియా యెదుట సాష్టాంగపడి 'పాద' నమస్కారం చేయడం అప్పట్లో పెను సంచలనమయ్యింది. ఆ తర్వాత కేసీఆర్‌, షరామామూలుగానే సోనియాపైనా, కాంగ్రెస్‌ పార్టీపైనా నిప్పులు చెరిగారనుకోండి.. అది వేరే విషయం. మొత్తానికి సోనియా ప్రసంగం తో కేసీఆర్ కు భయం మొదలైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: